Tirumla: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇవాల్టి నుంచి తిరుమలలో ఫేషియల్ రికగ్నిషన్ అమలు.. ఏయే కౌంటర్ల వద్దంటే?
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానిన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని భక్తలకు మెరుగైన సేవలు అందించేందుకు విశేషంగా కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానిన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని భక్తలకు మెరుగైన సేవలు అందించేందుకు విశేషంగా కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఈక్రమంలో తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం తదితర అంశాల్లో మరింత పారదర్శకత తెచ్చేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు.. కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేయనుంది. బుధవారం (మార్చి 1) నుంచే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది టీటీడీ. ఇందులో భాగంగా మంగళవారం తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రయోగాత్మకంగా కెమెరాలతో ఈ సాంకేతికతను పరిశీలించారు. ఖాళీ చేసే సమయంలోనూ గదులు పొందినవారే వచ్చి మరోమారు ఫేస్ రికగ్నేషన్ చేయిస్తే కాషన్ డిపాజిట్ చెల్లిస్తారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఈ సాంకేతికత సాయంతో లడ్డూలు ఇస్తారు.
ప్రస్తుతానికి గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ప్రస్తుతం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఆధునికి టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఒకే వ్యక్తి ఎక్కువ గదులు తీసుకోవడానికి వీలుండదు. ఈ విధానం వల్ల పారదర్శకంగా భక్తలకు సేవలు అందించవచ్చని టీటీడీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం లోటు పాట్లను పరిగణలోకి తీసుకుని, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..