Tirupathi: శ్రీవారి భక్తులకు శుభవార్త..! నేటి నుంచే అందుబాటులోకి మెట్ల మార్గం

శ్రీవారి భక్తులకు శుభవార్త..! అవును.. గతేడాది భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గాన్ని టీటీడీ తెరుస్తోంది. భారీ వరదల కారణంగా.. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఐదు నెలల నుంచి టీటీడీ మూసివేసింది. మరమ్మతులు పూర్తవడంతో ప్రారంభానికి సిద్ధమైంది.

Tirupathi: శ్రీవారి భక్తులకు శుభవార్త..! నేటి నుంచే అందుబాటులోకి మెట్ల మార్గం
Srivari Mettu
Follow us

|

Updated on: May 05, 2022 | 10:58 AM

Tirumala Tirupati Devasthanams: శ్రీవారి భక్తులకు తీపికబురు. శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభానికి అంతా రెడీ అయ్యింది. సీఎం జగన్‌ నేడు లాంఛనంగా మెట్ల మార్గాన్ని ప్రారంభించనున్నారు. నేటి నుంచే భక్తుల్ని ఈ మార్గం గుండా అనుమతించనున్నారు. గతేడాది చివరిలో భారీ వర్షాలు, వరదలతో మెట్టు మార్గం ధ్వంసమయ్యింది. టీటీడీ అప్పటి నుంచి భక్తుల్ని ఆ మార్గంలో అనుమతించడం లేదు. అప్పటి నుంచి అక్కడ మరమ్మతులు చేపట్టారు. తిరుమల కొండపైకి రెండు కాలినడక మార్గాలు ఉన్నాయి.. వాటిలో ఒకటి అలిపిరి.. ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది. రెండో కాలిబాట శ్రీవారి మెట్టు.. ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది. తిరుమలకు వెళ్లడానికి ఇది దగ్గరి దారి.

తిరుమలకు కళ్యాణీ డ్యాం నుంచి నీటి సరఫరాకు పైప్‌లైన్‌ వేసిన తర్వాత.. ఈ మార్గం కొంత అభివృద్ధి చెందింది. అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు లోపే ఉంటుంది. కాకపోతే శ్రీవారి మెట్టుకు చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎక్కువగా లేవు. ఏపీఎస్‌ ఆర్టీసీ ఇక్కడికి తిరుపతి నుంచి, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురంల మీదుగా ఒక బస్సు నడుపుతోంది. టీటీడీ ఉచిత బస్సు సేవ కూడా రైల్వే స్టేషను, బస్ స్టాండ్, అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకూ అందుబాటులో ఉంది. అలాగే శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుంచి ఆటోలో వెళ్లొచ్చు.

అఖిలాండ కోటీశ్వరుడు శ్రీవారిని దర్శించుకొనేందుకు నిత్యం లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి భక్తజనం తిరుమలకు పోటెత్తుతుంది. తాజాగా మెట్ల మార్గం అందుబాటులోకి వస్తుండడంతో భక్తజనం ఇబ్బందులు దూరం కానున్నాయి. 3.60 కోట్ల రూపాయలతో రాత్రింబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  సాక్షాత్తు శ్రీవారు నడిచిన మార్గం కాబట్టే శ్రీవారిమెట్టుకు ఎంతో విశిష్టత ఉందన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు భక్తులకు ఈ మార్గంలో అనుమతి ఇస్తామన్నారు. శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు నిత్యప్రసాదాలు అందజేస్తామని చైర్మన్ తెలిపారు.

Also Read: AP: పోలీసులని చూడగానే కారు వదిలేసి ఎస్కేప్.. అసలు ఏంది కథ అని వాహనం చెక్ చేయగా..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!