Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వారందరికీ దర్శనాలు రద్దు.. ఎప్పటివరకు అంటే..?

ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. దీంతో దర్శనానికి 48 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వారందరికీ దర్శనాలు రద్దు.. ఎప్పటివరకు అంటే..?
Tirumala

Updated on: Aug 13, 2022 | 9:37 PM

Tirumala Tirupati Devasthanams: కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండలపై కొలువుదీరిన వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో  తిరుమలలో  భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.  ప్రస్తుతం గోగర్భం జలాశయం వరకు 4 కిలోమీటర్ల మేర సర్వదర్శనం క్యూలైన్‌ ఉంది. ఈ క్రమంలో  శ్రీవారి(Lord Balaji) సర్వదర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 20 వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమల యాత్ర ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది. వరుస సెలవుల దృష్ట్యా ఈ నెల 20 వరకు రద్దీ ఉంటుందని భావిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, సిఫారసు లేఖలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..