Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. మరికొద్ది సేపట్లో ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల.. బుక్‌ చేసుకోండిలా..

|

Nov 24, 2022 | 9:32 AM

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. అదే సమయంలో నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. మరికొద్ది సేపట్లో ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల.. బుక్‌ చేసుకోండిలా..
Tirumala Tirupati Devasthanam
Follow us on

శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. డిసెంబర్‌ నెలకు సంబంధించి వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లు మరికొద్ది సేపట్లో విడుదల కానునన్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో ఈ స్పెషల్‌ కోటా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.  అదే సమయంలో నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు రోజులు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. అందులో భాగంగానే డిసెంబర్‌ కోటాకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది.

పద్మావతి అమ్మవారికి శ్రీవారి కాసుల హారం..

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి అమ్మవారి గజవాహన సేవ జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి కాసుల హారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకెళ్లనున్నారు. కాసుల హారం అలంకరణతో గజవాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పంచమి తీర్థం ఈనెల 28న జరిగనుంది. అశేష సంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసేందుకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..