Tirumala Heavy Rain Watch: తిరుమల నడక మార్గాలు మూసివేత.. కపిలతీర్థం ఉగ్రరూపానికి నీట మునిగిన తిరుపతి..  

|

Nov 18, 2021 | 6:47 PM

చిత్తూరు జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షానికి తిరుపతి, తిరుమల విలవిల్లాడిపోతున్నాయి. తిరుమల ఘాడ్ రోడ్డుల్లో కొండచరియలు, చెట్లు విరిగిపడుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే రెండు నడక మార్గాలను మూసివేసిన టీటీడీ... భక్తులకు ఎలాంటి అపాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Tirumala Heavy Rain Watch: తిరుమల నడక మార్గాలు మూసివేత.. కపిలతీర్థం ఉగ్రరూపానికి నీట మునిగిన తిరుపతి..  
Tirumala Rains
Follow us on

Tirumala Heavy Rain: ఆంధ్రప్రదేశ్‌ అంతటా వర్షాలు దంచికొడుతున్నాయి. స్టేట్‌ వైడ్‌గా వాయుగుండం అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వరుణుడి ఉగ్రరూపానికి కడప, చిత్తూరు జిల్లా చిగురుటాగుల్లా వణికిపోతున్నాయ్. వర్ష బీభత్సానికి ఈ మూడు జిల్లాలూ నీట మునిగాయి. వరద ఉధృతికి బస్సులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. రహదారులన్నీ కాలువల్లా మారితే, వీధులు వాగులను తలపిస్తున్నాయి. కుండపోత వర్షానికి తిరుపతి, తిరుమల విలవిల్లాడిపోతున్నాయి. తిరుమల ఘాడ్ రోడ్డుల్లో కొండచరియలు, చెట్లు విరిగిపడుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కపిలతీర్థం ఉగ్రరూపానికి తిరుపతి పట్టణం నీట మునిగింది.

జలదిగ్భందంలో తిరుమల..

వాయుగుండం ప్ర‌భావంతో తిరుమ‌ల‌లో బుధవారం రాత్రి నుండి నిరంత‌రాయంగా వ‌ర్షం కురుస్తోంది. దీంతో రెండో ఘాట్ రోడ్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంతో పాటు ప‌రిస‌ర ప్రాంతాలు మాడ‌వీధులు, తిరుమ‌ల‌లోని రోడ్లు, కాటేజీలు ఉన్న ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. నిర‌త‌రాయంగా కురుస్తున్న వ‌ర్షంతో భ‌క్తులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌తో పాటూ ద‌ర్శ‌నానంత‌రం బ‌య‌ట‌కు వ‌స్తున్న భ‌క్తులు ప‌రుగులు తీసుకుని షెడ్ల కింద‌కు వ‌స్తున్నారు. భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌న్న వాతావ‌ర‌ణశాఖ హెచ్చ‌రిక‌ల‌తో తిరుమల తిరుపతి దేవస్థానం ముంద‌స్తు ఏర్పాట్లు చేప‌ట్టింది.

కడప తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌లో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు వర్షం దెబ్బకు రోడ్డుపై నీటి ప్రవాహం పెరుగుతోంది. బాలపల్లి, కుక్కలదొడ్డి మధ్య వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. కడప -తిరుపతి వాహనాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. కార్లు సైతం మునిగిపోయేంత వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వరదలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి అంటున్నారు స్థానికులు.

ఇక భారీ వర్షాలతో ఏపీ టూరిజం వెనుకవైపు ఉన్న గోడ కూలింది. ఒక్కసారిగి గోడ కూలడంతో అక్కడే ఉన్న ఓ కార్మికుడు నారాయణ స్వామి అందులో ఇరుక్కుపోయాడు. అతడిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఫైర్, టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బంది. గంటసేపటిగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

శుక్రవారం పాఠశాలలకు సెలవు..

కల్యాణి జలాశయం పూర్తి నీటిమట్టానికి చేరుకుంది. పాలసముద్రంలో వెంగళరాజకుప్పం చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

తిరుపతి నగరంలోని రోడ్లు వరద కాలువలను తలపిస్తున్నాయి. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు ప్రహహిస్తోంది. రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌లు కూడా వర్షపు నీటితో నిండిపోయింది. మరోవైపు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో భారీగా వరద చేరింది. దీంతో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌ను అధికారులు నిలిపివేశారు.

మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు… కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే, తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురులు గాలులు వీస్తాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి: CM Jagan: కుప్పం ఎఫెక్ట్‌‌తో అసెంబ్లీకి రాలేదేమో.. చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు..

ఒక్క స్ట్రోక్‌తో కోటీశ్వరులైన మదుపరులు.. గతేడాది రూ. 12 పెట్టుబడి పెడితే ఇప్పుడెంతో తెలుసా?