తిరుపతి(Tirupati) జిల్లా శ్రీకాళహస్తి(Srikalahasti) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ ను లారీ ఢీ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. రేణిగుంట -నాయుడుపేట ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమించటంతో వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి(Chandragiri) చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనుపూరుమ్మ ఆలయాన్ని దర్శించుకుని.. మినీ వ్యాన్లో తిరుపతికి బయల్దేరారు. శ్రీకాళహస్తిలోని అర్ధనారీశ్వర స్వామి ఆలయం సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అర్జునయ్య, సరసమ్మ దంపతులతో పాటు మారెమ్మ అలియాస్ కావ్య మృతి చెందారు. టెంపో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read: