Tirumala News: తిరుమల క్షేత్రంలో సినిమా పాటల ప్రసారంపై టీటీడీ సీరియస్.. సిబ్బందిపై చర్యలు
TTD suspends assistant technician: పవిత్ర తిరుమల కొండపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లలో ఇటీవల దాదాపు గంటపాటు సినిమా పాటలు ప్రసారమయ్యాయి. ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో
TTD suspends assistant technician: పవిత్ర తిరుమల కొండపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లలో ఇటీవల దాదాపు గంటపాటు సినిమా పాటలు ప్రసారమయ్యాయి. ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, టీటీడీ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తప్పును సరిదిద్దుకునే చర్యలు చేపట్టింది టీటీడీ. దీనికి బాధ్యుడైన అసిస్టెంట్ టెక్నీషియన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. అటు టీటీడీ బ్రాడ్‌కాస్టింగ్ ఏఈకి సైతం టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీబీసీ భక్తి ఛానెల్‌లో, వేంకటేశ్వర స్వామికి చెందిన పాటలు, కార్యక్రమాలు మాత్రమే ప్రసారమవుతాయి. అయితే ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వేరే ఛానెళ్లకు చెందిన పాటలు ప్రసారమయ్యాయి. దీంతో స్పందించిన టీటీడీ, అసిస్టెంట్ టెక్నీషియన్ రవి కుమార్‌ను సస్పెండ్ చేయగా, బ్రాడ్‌కాస్టింగ్ విభాగానికి చెందిన ఏఈ కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
తిరుమలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే టీటీడీ స్క్రీన్‌పై ఒక్కసారిగా సినిమా పాటలు ప్రత్యక్షం కావడంతో, శ్రీవారి భక్తులు షాక్ తిన్నారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులలో ఆధ్యాత్మికతతో పాటు భక్తిభావం పెంచేందుకు, తిరుమలలోని భక్త జన సంచారం అధికంగా ఉండే శ్రీవారి ఆలయం, కళ్యాణకట్టతో పాటు పలు ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ల పై టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు శ్రీవారి ఆలయంలో స్వామి వారికి జరిగే పూజాది కార్యక్రమాలను ప్రసారం చేస్తారు.
వివిధ ప్రదేశాల నుంచి శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు, టీటీడీ ఏర్పాటు చేసిన స్క్రీన్ల వద్ద బస చేసి, టీటీడీ ప్రసారం చేసే కార్యక్రమాలను తిలకిస్తుంటారు. కానీ, షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై సినిమా పాటలు ప్రసారం కావడం వివాదస్పదమైంది.
Also Read: