TTD: ఆలయాల రోజువారీ వ్యవహారాలు న్యాయస్థానం పరిధిలోకి రావు.. స్పష్టం చేసిన సుప్రీం కోర్టు..

|

Nov 16, 2021 | 12:29 PM

తిరుమల దేవస్థానంలో శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ దాఖలైన పిటిషన్‎ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శ్రీవారి దాత ఒకరు శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు...

TTD: ఆలయాల రోజువారీ వ్యవహారాలు న్యాయస్థానం పరిధిలోకి రావు.. స్పష్టం చేసిన సుప్రీం కోర్టు..
Supreme Court
Follow us on

తిరుమల దేవస్థానంలో శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ దాఖలైన పిటిషన్‎ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శ్రీవారి దాత ఒకరు శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‎ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తోసిపుచ్చింది. పూజకార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని టీటీడీ గతంలో అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషనర్ కేవలం ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆలయ రోజువారీ వ్యవహారాలు రాజ్యాంగ న్యాయస్థానం పరిధిలోకి రావని ధర్మాసనం స్పష్టం చేసింది. శ్రీవారికి జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో అభ్యంతరాలుంటే టీటీడీ యజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని టీటీడీకి సూచించింది. స్వామివారికి పూజా కైంకర్యాలపై టీటీడీకి చెప్పినా పట్టించుకోకపోతే సరైన ఫోరాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‎కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీవారి దాత లేవనెత్తిన అంశాలపై 8 వారాల్లోగా స్పందించాలని టీటీడీకి సూచించింది.

Read Also… Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

Andhra Pradesh: ఏపీ రైతన్నలకు గుడ్‎‎న్యూస్.. ఆ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..