AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: సమ్మర్‌లో తిరుమల వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి అదిరిపోయే శుభవార్త..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారా.. అయితే ఇది మీ కోసమే.. రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. సమ్మర్ సెలవుల కారణంతో రైళ్లల్లో రద్దీ పెరిగింది. దీంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ నుంచి తిరుపతి వెళ్లేవారికి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది.

Tirumala: సమ్మర్‌లో తిరుమల వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి అదిరిపోయే శుభవార్త..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Jun 02, 2026 | 3:49 PM

Share

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల కోసం రైల్వేశాఖ అనేక ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే అనేక స్పెషల్ ట్రైన్లను తిరుపతి వెళ్లే రూట్లో ప్రవేశపెట్టగా.. తిరుమల వెళ్లేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం రైళ్లల్లో ఎక్కువమంది తిరుపతికి చేరుకుంటున్నారు. దీంతో తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మరో రైలును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ట్రైన్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రత్యేక రైళ్లు ఇవే..

గువహతి-తిరుపతి(05630) మధ్య ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. ఈ నెల 4వ తేదీన ఈ రైలు సర్వీసులు అందించనుంది. గువహతి నుంచి ఉదయం 7.20 గంటలకు బయల్దేరనుండగా.. 6వ తేదీన ఉదయం 8.40 గంటలకు తిరుపతికి చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైలు కామాఖ్య, రంగియా, బార్‌పేట రోడ్, న్యూ బొంగైగావ్, కోక్రాఝర్, న్యూ అలీపుర్‌దువార్, న్యూ కూచ్‌బెహర్, న్యూ జల్పైగురి, కిషన్‌గంజ్, బర్సోయ్, మాల్డా టౌన్, రాంపూర్ హాట్, బోల్పూర్ ఎస్ నికేతన్, దంకుని, అండుల్, ఖరగ్‌పూర్, బాలాసోర్, భుబాన్, బాలాసోర్, భుబాన్ రోడ్, ఖుర్దా రోడ్, బెర్హంపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, సింహాచలం నార్త్, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లో ఆగనుంది. ఈ ప్రత్యేక రైలులో 3AC, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

షెడ్యూల్ వివరాలు..

ఇక రంగపురా నార్త్-విజయవాడ(05862) ప్రత్యేక రైలును కూడా రైల్వేశాఖ ప్రకటించింది. ఇది 4వ తేదీన 16 .00 గంటలకు రంగపురా నార్త్‌లో బయల్దేరి శనివారం 15.00 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఇది ఉదల్‌గురి, రంగియా, బార్‌పేట రోడ్, న్యూ బొంగైగావ్, కోక్రాఝర్, న్యూ కూచ్‌బెహార్, న్యూ జల్‌పైగురి, అలుబారి రోడ్, కిషన్‌గంజ్, మాల్దా టౌన్, రాంపూర్ హాట్, బోల్పూర్ ఎస్ నికేతన్, బర్ధమాన్, దంకుని, అండుల్, ఖరగ్‌పూర్, బాలాసోర్, మరాజ్‌పూర్, బాలాసోర్, మభద్ర రోడ్ ఖుర్దా రోడ్, బాలుగావ్, బెర్హంపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలులో 3AC, స్లీపర్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రజలు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని రైల్వేశాక  పేర్కొంది.

Follow Us