AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: ఏపీలో కరెంట్ కోతల తిప్పలు.. అంధకారంలో తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి..

Tirupati Maternity Hospital: ఏపీలో కరెంట్ కోతల తిప్పలు తప్పడం లేదు. నిరంతరం విద్యుత్ కోతలు రోగుల పాలిట శాపంగా మారాయి. ఆస్పత్రుల్లో విద్యుత్‌ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Tirupati: ఏపీలో కరెంట్ కోతల తిప్పలు.. అంధకారంలో తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి..
Tirupati
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2022 | 8:02 AM

Share

Tirupati Maternity Hospital: ఏపీలో కరెంట్ కోతల తిప్పలు తప్పడం లేదు. నిరంతరం విద్యుత్ కోతలు రోగుల పాలిట శాపంగా మారాయి. ఆస్పత్రుల్లో విద్యుత్‌ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండువేసవిలో కరెంట్ లేకపోవడంతో జనం అల్లాడుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లో కూడా కరెంట్ కోతలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎమెర్జన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో అనధికార కోతలు విధిస్తున్నారు. దీంతో కరెంట్‌ కోతల ఎఫెక్ట్‌ ఆస్పత్రులపైనా పడింది. తాజాగా, తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్ అంధకారంలోకి వెళ్లింది. గంటల తరబడి కరెంట్‌ లేకపోవడంతో, గర్భిణులు, బాలింతలు నానా అవస్థలు పడ్డారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. అటు ఆస్పత్రుల్లోని జనరేటర్లు కూడా పనిచేయడం లేదు. దీంతో ఆందోళనకు దిగారు పేషంట్ల బంధువులు.

ఆస్పత్రుల్లో కరెంట్‌ కోతలు, వైద్యులు, సిబ్బందికి తలనొప్పిగా మారాయి. రోగుల బంధువుల ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు వైద్యాధికారులు. అటు, ఎమర్జెన్సీ విభాగంలో ఉన్న పేషంట్లను పక్క వార్డులకు మారుస్తున్నారు ఆసుపత్రుల సిబ్బంది. కనీసం జనరేటర్లు పనిచేసినా, ఈ తిప్పలు తప్పేవని చెబుతున్నారు.

పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో, చదువుకుంటున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పగలు చదువుకుంటున్నా, రాత్రిళ్లు సరైన నిద్రలేక జాగారం చేస్తున్నారు స్టూడెంట్స్‌. ఈ ప్రభావం పరిశ్రమలపై కూడా కనిపిస్తోంది. పవర్ పోవడంతో జనాలు విద్యుత్ కార్యాలయాలకు ఫోన్లు చేసి, ఆఫీసర్లపై ఫైర్‌ అవుతున్నారు.

Also Read:

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతుందా.. ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!

Maha Dharna: ఢిల్లీపై గులాబీ దండయాత్ర.. రైతుల పక్షాన దీక్షకు దిగుతున్న సీఎం కేసీఆర్‌..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే