AP Weather Alert: ఏపీ ఆ ప్రాంతాల్లోని ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం.. రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్Andhra Pradesh)లో ఎండలు మండిస్తున్నాయి. భానుడి భగభగలకు వడగాల్పులు (Heat Waves) తోడుకావడంతో జనం ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్Andhra Pradesh)లో ఎండలు మండిస్తున్నాయి. భానుడి భగభగలకు వడగాల్పులు (Heat Waves) తోడుకావడంతో జనం ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని కొన్ని ప్రాంత ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా అమరావతి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణం లో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ గాలుల ఫలితంగా రాష్రరంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈ ప్రాంతాల్లో ఈరోజు, రేపు , ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ప్రకటించింది.
రాయలసీమ: ఈరోజు రేపు ,ఎల్లుండి మూడు రోజులు పాటు ఇక్కడ వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
Jharkhand: త్రికూట పర్వతాల్లో ఘోర ప్రమాదం.. తెగిపడిన రోప్ వే ట్రాలీలు.. ముగ్గురు దుర్మరణం
Minister RK Roja: ప్రమాణస్వీకారం వేళ రోజా ఎమోషనల్.. జగన్‌కు పాదాభివందనాలు..