Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం.. 500వ మెట్టు వద్ద సేద తీరుతూ..!

చిరుత సంచరించినట్లు జరిగిన ప్రచారం తప్పుడు సమాచారంగా తేల్చారు. ఈ మార్గంలో చిరుత రాలేదని స్పష్టం చేశారు. భక్తులు యథావిధిగా దర్శనాలకు వెళ్తున్నట్లు తెలిపారు. మరోవైపు శనివారం సాయంత్రం సుమారు 5.30 గంటలకు శిలాతోరణం వద్ద చిరుత కనిపించిందని.. తరువాత అది అడవుల్లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.

Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం.. 500వ మెట్టు వద్ద సేద తీరుతూ..!
Leopard

Updated on: Jun 01, 2025 | 2:03 PM

తిరుమల తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కనిపించిందనే వార్త కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గం 500వ మెట్టు దగ్గర చెట్లపొదల్లో సేద తీరుతున్న చిరుతను చూశామంటూ భక్తులు సమీపంలోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, శ్రీవారి మెట్టు మొదట్లో చెకింగ్ పాయింట్ దగ్గర భక్తులను అనుమతించిన అధికారులు. సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం చేశారు. అయితే, ఈ వార్త అవాస్తవం అంటున్నారు అధికారులు.

శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు అవాస్తవమని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. చిరుత సంచరించినట్లు జరిగిన ప్రచారం తప్పుడు సమాచారంగా తేల్చారు. ఈ మార్గంలో చిరుత రాలేదని స్పష్టం చేశారు. భక్తులు యథావిధిగా దర్శనాలకు వెళ్తున్నట్లు తెలిపారు. మరోవైపు శనివారం సాయంత్రం సుమారు 5.30 గంటలకు శిలాతోరణం వద్ద చిరుత కనిపించిందని.. తరువాత అది అడవుల్లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..