Tirumala: శ్రీవారి క్షేత్రంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల తొలగింపు.. టీటీడీ నిర్ణయంపై వ్యాపారుల అసంతృప్తి.. భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి..

|

Feb 19, 2022 | 6:30 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలనే ఉద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే

Tirumala: శ్రీవారి క్షేత్రంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల తొలగింపు.. టీటీడీ నిర్ణయంపై వ్యాపారుల అసంతృప్తి.. భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి..
Follow us on

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలనే ఉద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొండపై నున్న ప్రైవేటు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తొలగించి, భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని, తిరుమలలో భోజనాన్ని భక్తులు డబ్బుతో కొనుగోలు చేయొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు. కాగా తమను ఒక్కసారి కూడా సంప్రదించకుండా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తొలగించడం సమంజసం కాదంటున్నారు తిరుమల ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మునిరెడ్డి. ఈ మేరకు శనివారం ఆయన తిరుమలలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు.

అందరినీ కలుస్తాం..

తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు తొలగించాలన్న టీటీడీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడి వ్యాపారులు. తమను ఒక్కసారైనా సంప్రదించకుండా టీటీడీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. ఈమేరకు శనివారం వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామన్నారు. తమ సమస్యలను తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా టీటీడీ ఛైర్మన్, ఈఓలను కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగిస్తే వచ్చే సమస్యలను వివరిస్తామన్నారు.

Also Read:Aadhaar Card: ఆధార్ కార్డ్‌లో ఫొటో తప్పు పడిందా.. ఆన్‌లైన్‌లో మార్చలేరు.. ఇలా చేయాల్సిందే..?

UP Elections: చేతికి సంకెళ్లు.. మెడలో గిన్నె.. ఓట్లు అడుగుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి.. ఎందుకో తెలుసా?

Crime News: వివాహితపై యువకుడి అత్యాచార ప్రయత్నం.. ప్రతిఘటించడంతో దారుణ హత్య..