శ్రీకాళహస్తి సీఐ సీఐ అంజూయాదవ్ దూకుడుకు కళ్లెం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న వీడియోలు.. ఆమెలోని అసలు కోణాన్ని బయటపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ దాబా ఓనర్‌కు ధమ్కీ ఇచ్చిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. శ్రీకాళహస్తి సీఐగా విధులు నిర్వహిస్తున్న అంజూయాదవ్.. ఓ లేడీ విలన్‌లా ముద్రవేసుకున్నారు. ఆమె ప్రవర్తన, దూకుడు చూస్తుంటే అంజూయాదవ్ పోలీసుల్లా ప్రవర్తించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన ఓవర్ యాక్షన్ సంబంధించిన వీడియోలో ఆ దాబా ఓనర్‌ను బెదిరిస్తున్నారు. తొడగొట్టి మరీ సవాల్ చేయడం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సీఐ అంజూయాదవ్ ప్రవర్తన చాలా చిత్ర విచిత్రంగా కనిపించింది. ఓసారి కోపంతో మరోసారి వెటకారంగా మాట్లాడారు. నవ్వుతూనే బెదిరింపులకు దిగడం ఖాకీ దుస్తుల్లో ఉన్న అంజూయాదవ్ విలనిజాన్ని చూపుతోంది.ఇప్పటికే అంజూయాదవ్ ప్రవర్తనపై ఏపీ HRC నోటీసులు కూడా జారింది.
ఈనెల 27లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించిన క్రమంలో మరో వీడియో బయటకు రావడం హాట్‌టాపిక్‌గా మారింది. అటు.. ఆమె ప్రవర్తన పోలీసు శాఖలోనూ చర్చనీయాంశంగా మారింది. అంజూయాదవ్ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ ఇప్పటికే డీఐజీకి నివేదిక ఇవ్వడంతో.. క్రమశిక్షణకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రేపు తిరుపతి టూర్ ఉండడంతో ఈలోపే చర్యలు తీసుకుంటారా చర్చ కూడా సాగుతోంది. అంజు యాదవ్ స్టేషన్ వదిలి బయటికొస్తే చాలూ.. ఏదో రకంగా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారుతున్నారు. రీసెంట్‌గా ఆందోళన చేస్తోన్న జనసేన కార్యకర్తల విషయం ఏంటి, ఎందుకు నిరసన చేస్తున్నారని తెలుసుకోకుండానే లెఫ్ట్‌రైట్ ఇచ్చారు. దాంతో సీఐ తీరుపై అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..