Tirumala: నేటి నుంచి తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్.. షాంపూ ప్యాకెట్‌కు కూడా అనుమతి లేదు…

|

Jun 01, 2022 | 9:59 AM

తిరుమలలో బుధవారం నుంచి ప్లాస్టిక్ నిషేధించారు. అలిపిరి టోల్‌గేట్ దగ్గరే తనిఖీలు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతిస్తామన్నారు.

Tirumala: నేటి నుంచి తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్.. షాంపూ ప్యాకెట్‌కు కూడా అనుమతి లేదు...
Tirumala
Follow us on

TTD: టీటీడీ కీ డెసిషన్ తీసుకుంది. ఇవాళ్టి నుంచి తిరుమలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అలిపిరి టోల్‌గేట్‌(Alipiri toll gate) దగ్గర తనిఖీలు చేయనున్నారు. ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతిస్తామన్నారు టీటీడీ అధికారులు. ప్లాస్టిక్ కవర్లు వాడే షాప్స్‌, హోటల్స్‌ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరింది. చాలా రోజులుగా తిరుమలలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దుకాణదారులకు సమావేశం నిర్వహించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించింది.ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్‌ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి ఇకపై అనుమతించబోమన్నారు. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే షాపుల్లో ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలను నిషేధించారు. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్‌ వినియోగాన్ని బ్యాన్ చేశారు.  షాంపులు కూడా తిరుమలలో నిషేదించారు.  ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు తమకు సహకరించాలని టీటీడీ కోరింది. జూలై ఫస్ట్ నుంచి 6 A కేటగిరీగా వర్గీకరించిన ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్‌ నిషేధిస్తారు. తిరుమల తరహాలోనే వేర్వేరు ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్‌‌ను కంప్లీట్‌గా బ్యాన్ చేస్తారు.

మరిన్ని తిరుమల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి