AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: తిరుపతిలో దారుణం.. విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం.. మరొకరు వీడియో తీసి..

విద్యాబుద్ధులు నేర్పాల్సిన విశ్వవిద్యాలయంలో కీచక పర్వం వెలుగుచూసింది. విద్యార్థినిపై.. అద్యాపకులు లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. మొదటి సంవత్సరం విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. లక్ష్మణ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడగా.. ఆ దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు.

Tirupati: తిరుపతిలో దారుణం.. విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం.. మరొకరు వీడియో తీసి..
Ap Crime News
Shaik Madar Saheb
|

Updated on: Dec 07, 2025 | 4:42 PM

Share

కన్నబిడ్డల్లా చూడాల్సిన విద్యార్ధులను కొందరు ఉపాధ్యాయులు కామంతో చూస్తున్నారు. మాయమాటలు చెప్పి లోబరచుకుని వారి జీవితాలనే నాశనం చేస్తున్నారు. తిరుపతిలో అలాంటి ఘటనే జరిగింది. తిరుపతి నేషనల్‌ సంస్కృత యూనివర్సిటీలో చదువు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్ కామాంధుడిగా మారాడు. విద్యార్థిని లైంగికంగా వేధించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. తిరుపతి నేషనల్‌ సంస్కృత యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన యువతి బీఎడ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ కన్ను వేశాడు. ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. శారీరక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. లక్ష్మణ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడగా.. ఆ దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేయగా.. వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ GSR కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసింది.

విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సెల్‌ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు.

ఈ ఘటన జరిగిన తర్వాత బాధితురాలు ఒడిషాకు వెళ్లిపోయింది. మరోవైపు విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ని నియమించినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో