MP Gurumurthy: ఎంపీకే రూ.5 కోట్ల రుణం మంజూరైందంటూ ఫోన్.. చివరకు ఏమైందో తెలుసా..

|

Jan 14, 2022 | 8:29 PM

Tirupati MP Gurumurthy: అతనొక పార్లమెంట్ సభ్యుడు.. అలాంటి వ్యక్తికే రూ. 5 కోట్ల రుణం మంజూరైందంటూ.. ఓ ఆగంతకుడు

MP Gurumurthy: ఎంపీకే రూ.5 కోట్ల రుణం మంజూరైందంటూ ఫోన్.. చివరకు ఏమైందో తెలుసా..
Mp Gurumurthy
Follow us on

Tirupati MP Gurumurthy: అతనొక పార్లమెంట్ సభ్యుడు.. అలాంటి వ్యక్తికే రూ. 5 కోట్ల రుణం మంజూరైందంటూ.. ఓ ఆగంతకుడు పోన్ చేశాడు. అది సీఎంఓ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ తెలిపాడు. తీరా ఎంపీ రంగంలోకి దిగడంతో అది ఫేక్ కాల్ అని తేలింది. ఓ ఆగంతకుడు 5 కోట్ల రూపాయల రుణం మంజూరైందంటూ తిరుపతి (Tirupati) ఎంపీ గురుమూర్తి (MP Gurumurthy) కి కాల్ చేశాడు. తాను అభిషేక్ అని సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానంటూ ఎంపీతో చెప్పాడు. 20 మందికి ఒక్కొక్కరికి 25 లక్షల మేర రుణం మంజూరు అయినట్లు అభిషేక్ ఎంపీకి వివరించాడు. లోన్ మొత్తంలో 5శాతం చొప్పున 1.25 లక్ష రూపాయలు ముందుగా డిపాజిట్ చేయాలని బ్యాంకు ఖాతా వివరాలను అభిషేక్ ఎంపీ గురుమూర్తికి పంపించాడు.

దీనిపై అనుమానం వచ్చిన ఎంపీ గురుమూర్తి అభిషేక్ ఫోన్ కాల్ పై సిఎమ్ఓ కార్యాలయంతోపాటు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో ఆరా తీశారు. అలాంటి వ్యక్తులు ఎవరూ లేరని ఇరు కార్యాలయాల అధికారులు తెలిపారు. దీంతో ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్న ఎంపీ గురుమూర్తి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎంపీ గురుమూర్తి ఎస్పీని కోరారు.

Also Read:

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం.. తప్పిన పెను ప్రమాదం..

Indian Passport: పాస్‌పోర్టు ఉన్న భారతీయులకు గుడ్‌న్యూస్.. వీసా లేకున్నా, 59 దేశాలకు ప్రయాణం!