Tirupati: ఆ ఇంటి నుంచి వింత వాసన.. రహస్య సమాచారంతో అధికారులు సోదాలు చేయగా..

ఏపీలో గంజాయి దందా రూటు మారుతోంది. నగరాలు, పట్టణాలను దాటుకుని ఇప్పుడు గ్రామాల్లోకి విస్తరిస్తోంది. తిరుపతి జిల్లాలో బయటపడిన ఘటన స్థానికులను నివ్వెరపోయేలా చేసింది.

Tirupati: ఆ ఇంటి నుంచి వింత వాసన.. రహస్య సమాచారంతో అధికారులు సోదాలు చేయగా..
Ganja Plants (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 25, 2023 | 9:38 AM

గంజాయికి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు ఇది పెను ప్రమాదం కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున గంజాయికి బానిసయినట్లు సమాచారం ఉంది. దీంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. గంజాయి పెంపకం, రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కఠిన సెకన్లు పెడుతున్నారు. దీంతో కేటుగాళ్లు అలెర్టయ్యారు. ఏకంగా ఇంట్లోనే గంజాయి పెంపకం షురూ చేశారు. తాజాగా తిరుపతి జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంటే వెలుగుచూసింది. చిల్లకూరు మండలం మన్నెగుంట గ్రామంలో ఒక వ్యక్తి ఏకంగా తన ఇంటి ఆవరణలోనే గంజాయి మొక్కలు పెంచాడు. అతడి ఇంటి నుంచి కాస్త తేడాగా వాసన వస్తుండంతో ఇరుగుపొరుగువారికి తొలుత ఏం అర్థం కాలేదు. అదే వింత వాసన రోజూ కంటిన్యూ అవ్వసాగింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులకు రహస్య సమాచారం అందజేశారు.

నిందితుడి ఇంటిపై దాడులు చేసిన అధికారులు సైతం స్టన్ అయ్యారు. నిందితుడు వెంకయ్య ఇంట్లో సుమారు 7 అడుగుల వరకు పొడవు పెరిగిన నాలుగు గంజాయి మొక్కలను గుర్తించారు. వెంకయ్య, స్నేహితుడు ప్రతాప్ సాయంతో ఈ మొక్కలను పెంచినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొక్కల వయస్సు 4 నెలల వరకు ఉంటుందని.. గంజాయి 2 కేజీల బరువు ఉందని వివరించారు. ఎవరైనా గంజాయి మొక్కల పెంపకం, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..