
తిరుమల శ్రీవారి వైకుంట ద్వారా దర్శనానికి సమయం ఆసన్నమైంది.డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు జరుగనున్నాయి. దీంతో శ్రీవారికి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తోపులాటలు, గందరగోళ పరిస్థితులు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైకుంఠద్వార దర్శనాల తొలి మూడు రోజుల్లో మూడు ప్రాంతాల నుంచి స్లాటెడ్ భక్తులకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకు గాను 30వ తేదీ (ఏకాదశి), 31వ తేదీ (ద్వాదశి), జనవరి 1వ తేదీకి సంబంధించి మొత్తం 1.76 లక్షల మంది భక్తులకు ఈ-డిప్ విధానంలో ముందస్తుగా స్లాటెడ్ సర్వ దర్శన టోకెట్లను కేటాయించింది.
అయితే వైకుంఠ ద్వారా దర్శన మొదటి రోజున 5 గంటల వీఐపీ బ్రేక్ దర్శనాల మినహా మిగతా టైం మొత్తం స్లాటెడ్ దర్శన టోకెన్లు కలిగిన భక్తుల దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రోజుకు 60,000 మందికి పైగా భక్తులకు, మొత్తం 14 స్లాట్లలో టోకెన్లు జారీ చేయగా, వీరికి ప్రవేశ మార్గాలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం స్లాట్ల భక్తులు కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్ల భక్తులు ఏటీజీహెచ్ నుంచి, రాత్రి స్లాట్ల భక్తులు శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.ఇక వైకుంటద్వారా దర్శనాల నేపథ్యలో మూడు రోజుల పాటు టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది.
భక్తులకు జిల్లా ఎస్పీ సూచనలు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.