స్వర్ణాంధ్ర విజన్- 2047 కు అనుగుణంగా తిరుమల విజన్ -2047 వైపు అడుగులు వేస్తోంది TTD బోర్డ్. దీనిలో భాగంగా తిరుమలలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ కట్టడాల పరిరక్షణపై దృష్టి సారించింది. దీనికోసం ప్రముఖ ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. ఆధునిక టౌన్ ప్లానింగ్‌ని పాటిస్తూనే తిరుమల..పవిత్రత పెంపొందించేందుకు శాశ్వత వ్యూహాల అమలు చేయడం ఈ విజన్‌లో భాగం. అలాగే తిరుమలలో వారసత్వ కట్టడాల పరిరక్షణ, పర్యావరణ నిర్వహణకు ప్రాముఖ్యత కల్పిండం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి.
ఇక తిరుమలను ప్రపంచ స్థాయి రోల్ మోడల్‌గా మార్చే యత్నాలు చేస్తోంది టీటీడీ. తిరుమల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తోంది. తిరుమలలో భక్తుల ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగు పరుస్తారు. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలు అయోధ్య, కాశీని డెవలప్ చేసినట్లే, తిరుమలను కూడా డెవలప్ చేస్తామంటోంది టీటీడీ బోర్డ్.
ఆసక్తి ఉన్న ఏజెన్సీలు 3 వారాల్లో తమ ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా టీటీడీ కోరింది. ఇలాంటి భారీస్థాయి పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఏజెన్సీలకు ముందస్తు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఆ ఏజెన్సీలు..వారసత్వ కట్టడాల పరిరక్షణ, పర్యావరణ నిర్వహణను ఆధునిక టౌన్ ప్లానింగ్‌తో మిళితం చేసి, బృహత్తర భవిష్యత్ ప్రణాళికను రూపొందించాలి. రాబోయే కాలంలో…తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడడమే విజన్ – 2047 లక్ష్యంగా ఉండాలని టీటీడీ భావిస్తోంది.
ఇది చదవండి: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ ప్రాంతాలకు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు