AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD action Plan: తిరుమల ప్రక్షాళన షురూ.. దళారీ వ్యవస్థను అరికట్టేలా టీటీడీ యాక్షన్‌ ఫ్లాన్..!

తిరుమలలో యాక్షన్ షురూ అయింది. స్పెషల్ దర్శనాల టికెట్ల దందాకు చెక్ పెట్టేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్‌ లింక్ చేస్తూ ఈవో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ కొరడా జులిపించే చర్యలకు సిద్ధమైంది.

TTD action Plan: తిరుమల ప్రక్షాళన షురూ.. దళారీ వ్యవస్థను అరికట్టేలా టీటీడీ యాక్షన్‌ ఫ్లాన్..!
Ttd Review Meet
Raju M P R
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 03, 2024 | 5:49 PM

Share

తిరుమలలో యాక్షన్ షురూ అయింది. స్పెషల్ దర్శనాల టికెట్ల దందాకు చెక్ పెట్టేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్‌ లింక్ చేస్తూ ఈవో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ కొరడా జులిపించే చర్యలకు సిద్ధమైంది. దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జిల్లా ఎస్పీ తోపాటు పోలీస్ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది. టీటీడీ ఈవోగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జె. శ్యామలరావు.. దీనిపై దృష్టిసారించారు. దళారీలను ఎలా అరికట్టాలనే దానిపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల అవసరాలు ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే దళారులపై నిఘా పెంచాలన్నారు. వసతి, దర్శనం, ఆర్ధితసేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న దళారులను ఉపేక్షించ వద్దన్నారు ఈఓ. దళారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ మేరకు అధికారులకు ఈవో కీలక సూచనలు చేశారు. తిరుమలలో దళారులకు సంబంధించి ఆన్ లైన్, లక్కీడిప్ సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, దొంగతనం కేసులు, మద్యపానం, నకిలీ వెబ్‌సైట్లు తదితర అంశాలకు చెందిన కేసులను సమీక్షించారు.

ఏ దశల్లో కేసులు ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీసులు ఈఓ కు వివరించగా మరో వారంలోగా కేసుల్లో ఉన్న దళారులకు చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలను ఈఓ పోలీసులను కోరారు. కేసులు కూడా సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగాలు తరచూ సమావేశం కావాలన్నారు ఈఓ శ్యామల రావు.

నడక మార్గాల్లో భక్తుల భద్రతపై టీడీడీ ఫోకస్

అలాగే తిరుమల నడక మార్గాల్లో భక్తుల భద్రతపై టీడీడీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఏపీ ఫారెస్ట్, టీటీడీ ఫారెస్ట్, ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగాలతో టీటీడీ ఈవో శ్యామల రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ టీం చేసిన ప్రతిపాదనలపై ఫారెస్ట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కొండకు చేరే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చిరుతలు, ఇతర జంతువులు సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలని EO ఆదేశించారు. అలాగే, కాలినడక మార్గాల్లో నిర్దేశించిన సమయాల్లోనే భక్తులు తిరుమలకు చేరుకునేలా మార్పులు చేయాలని అధికారులు ఈవో దృష్టికి తీసుకువచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..