
క్రిస్‌మస్ వరుస సెలవుల నేపథ్యంలో ప్రముఖ దేవస్థానం తిరుమల తిరుపతికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటలు పడుతుంది. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27, 28, 29 మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శన టికెట్ల జారీని రద్దు చేసింది. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత మళ్లీ యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.
భక్తులు టీటీడీ విజ్ఞప్తి
భక్తుల రద్దీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ నిర్ణయంతో రేణిగుంట ఎయిర్‌పోర్టులోని తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేయడం ఆపేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు దర్శన ప్రణాళికలను రూపొందించికోవాలని టీటీడీ కోరింది.
In view of heavy pilgrim rush at Tirumala, issuance of Srivani offline tickets stands cancelled on December 27, 28 and 29. Tickets will not be issued at Tirumala Srivani counters and Renigunta Airport. Devotees are requested to plan accordingly.#ttd #tirumala #srivani pic.twitter.com/2rHhtMiRYL
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) December 25, 2025
అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోమార్పు
ఇదిలా ఉండగా తిరుమల అంగప్రదక్షణ టోకెన్ల జారీ విధానంలోనూ టీటీడీ మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతంలక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అనే పద్ధతిలో టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం 3 నెలలకు ముందే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానుండగా.. భక్తులు ముందుగానే బుక్‌చేసుకోవాల్సి ఉంటుంది. టీటీడీ తాజా మార్పులను భక్తులు గమనించాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.