AP Weather: ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. వారందరికీ అలెర్ట్..

|

May 13, 2024 | 7:01 PM

ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం....

AP Weather: ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. వారందరికీ అలెర్ట్..
Andhra Weather Report
Follow us on

మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి అల్లూరి జిల్లా పాడేరులో 57.5మిమీ, ప్రకాశం జిల్లా కనిగిరిలో 52.5మిమీ, శ్రీసత్యసాయి జిల్లా సోమండేపల్లిలో 46.5మిమీ, బాపట్ల జిల్లా అద్దంకిలో 38.5మిమీ, ప్రకాశం చంద్రశేఖరపురంలో 38మిమీ, అల్లూరి జిల్లా కొయ్యురులో 29.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 27 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడినట్లు తెలిపారు.

ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 41.2°C, తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో 41.1°C, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 40.8°C, నంద్యాల జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 40.6°C, కృష్ణా జిల్లా కంకిపాడు,ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరులో 40.4°C, కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో 40.3°C, శ్రీకాకుళం జిల్లా సారవకోటలో 40.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…