విహార యాత్రలో విషాదం, ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల గల్లంతు, మెరైన్‌ పోలీసుల హెచ్చరిక

|

May 16, 2022 | 6:59 PM

బాపట్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన యువ ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. అప్పటి వరకు తమతోపాటు సరదాగా గడిపిన తమ స్నేహితులు అలలధాటికి కొట్టుకుపోవటంతో కూడా వచ్చిన స్నేహితులు ఆందోళనలోపడ్డారు.

విహార యాత్రలో విషాదం, ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల గల్లంతు, మెరైన్‌ పోలీసుల హెచ్చరిక
Students Missing
Follow us on

బాపట్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన యువ ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. అప్పటి వరకు తమతోపాటు సరదాగా గడిపిన తమ స్నేహితులు అలలధాటికి కొట్టుకుపోవటంతో కూడా వచ్చిన స్నేహితులు ఆందోళనలోపడ్డారు. మరోవైపు కనిపించకుండా పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ బిడ్డల్ని ఎలాగైన సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో సముద్ర తీరంలో ఈ విషాదం చోటు చేసుకుంది. విద్యార్దుల విహారయాత్ర విషాదయాత్రగా మారింది. సరదాగా సముద్ర స్నానాలకు వెళ్లిన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్దుల్లో ఇద్దరు సముద్రంలో అలలధాటికి గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు షేక్ జిలాని(21), నల్లగోర్ల దుర్గ(21)గా గుర్తించారు… వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ స౦వత్సర౦ చదువుతున్న విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది. అంతలోనే సముద్రం అలలు పోటెత్తాయి. ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి విద్యార్థులు గల్లంతయ్యారు. స్టూడెంట్స్‌ కొట్టుకుపోయారనే సమాచారం అందుకున్న మెరైన్‌ పోలీసులు సముద్రతీరానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

విద్యార్దులు గుర్తింపుపొందిన బీచ్‌లు వేటపాలెం, రామాపురం కాకుండా మధ్య ప్రాంతంలో నిర్జన ప్రదేశంలో సముద్రంలో ఈతకు వెళ్లడం వల్ల గల్లంతైన విద్యార్దుల సమాచారం అందడంలో ఆలస్యమైందని చెబుతున్నార పోలీసులు. అలా కాకుండా గుర్తించిన బీచ్‌లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసుల గస్తీ ఉంటుందని, ఒకవేళ అలల ధాటికి ఎవరైనా ప్రమాదానికి గురైతే వెంటనే గుర్తించి సాయం చేసేందుకు వీలుంటుందని మెరైన్‌ పోలీసులు చెబుతున్నారు. జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని నిర్జన ప్రదేశాల్లో బీచ్‌లకు వెళ్లరాదని ప్రజలను హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి