Sajjala: ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్రపై సజ్జల రియాక్షన్ ఇదే.. 

వైఎస్ షర్మిల.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఆమె ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్షమమై ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ప్రధాన పార్టీలకు సవాల్ విసరుతున్నారు.

Sajjala: ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్రపై సజ్జల రియాక్షన్ ఇదే.. 
Sajjala 2

Updated on: Mar 25, 2024 | 9:20 PM

వైఎస్ షర్మిల.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఆమె ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్షమమై ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ప్రధాన పార్టీలకు సవాల్ విసరుతున్నారు. అయితే వైఎస్ జగన్, షర్మిలకు ఎక్కడ మనస్పర్ధలు ఎక్కడ వచ్చాయి? ఆమె ఏపీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అనే విషయాలపై ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీవీ9 క్రాస్ ఫైర్‌లో వివరించారు.

‘‘రాజకీయాలు వేరు.. రిలేషన్స్ వేరు.. వైసీపీ పార్టీకి అసలు ఆధ్యుడు జగన్ రెడ్డి. వైఎస్ షర్మిల మొదట తెలంగాణలో రాజకీయం చేశారు. ఆ తర్వాత ఏపీకి సడన్ వచ్చేశారు. ఏం జరిగిందో ఏమో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. మొదటిరోజు నుంచే చంద్రబాబు ఎజెండానే ఫాలో అవుతూ జగన్ పై విమర్శలు చేస్తోంది. దివాళ తీసిన పార్టీకి ఆమె సారథ్యం వహిస్తున్నారు. పగటి కలలు కనేవాళ్లకు ఏపీ ప్రజలు సరైన సమాధానం ఇస్తారు’’ అని సజ్జల వెల్లడించారు.