Sajjala: పర్సనల్‌గా పవన్‌ను చూస్తే జాలేస్తోంది: సజ్జల ఇంట్రస్టింగ్ కామెంట్స్

Sajjala: పర్సనల్‌గా పవన్‌ను చూస్తే జాలేస్తోంది: సజ్జల ఇంట్రస్టింగ్ కామెంట్స్

Ram Naramaneni

|

Updated on: Mar 25, 2024 | 9:01 PM

పవన్‌కు అంత ఫ్యాన్ బేస్ ఉంది.. కరిష్మా ఉంది.. కానీ దాన్ని వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకొచ్చారు సజ్జల. కేవలం ఓ గెస్ట్ ఆర్టిస్ట్‌గా చంద్రబాబు కోసం పనిచేస్తూ తన జీవితాన్ని పవన్ కొవ్వొత్తిగా కరిగించుకుంటున్నారని సజ్జల అభిప్రాయపడ్డారు. పార్టీని పెట్టి 10 ఏళ్లు నిర్మాణం చేయలేకపోవడం అతని చేతగానితనమన్నారు.

పవన్‌పై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో సజ్జల ఆసక్తికర కామెంట్స్‌ చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. పవన్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదన్నారు.
పర్సనల్‌గా పవన్‌ను చూస్తే జాలేస్తోంది అని ఆయన పేర్కొన్నారు.  అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు.  రాజకీయాలపై పవన్‌కు ఒక క్లారిటీ లేదని చెప్పారు సజ్జల. మా లీడర్‌ని తిట్టినప్పుడు తమ పార్టీ నేతలు తిరిగి కౌంటర్ ఇవ్వడంలో తప్పు ఏముందన్నారు. అటు వైపు నుంచి యాక్షన్ ఉంటే.. మా వైపు నుంచి కూడా రియాక్షన్ ఉంటుందన్నారు. ఓ కోర్డినేషన్‌తో తిట్టించే విధానం టీడీపీది అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..  

Published on: Mar 25, 2024 09:01 PM