ఆర్టీసీ డ్రైవర్ కు తేలుకాటు.. నిలిచిపోయిన బస్సు, అధికారుల తీరుపై ప్రయాణికుల మండిపాటు

|

Feb 22, 2024 | 12:59 PM

ప్రయాణికులను సురక్షిత గమ్యస్థానాలను చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్లది కీలక పాత్ర. గంటల తరబడి విధులు నిర్వహిస్తూ ఆర్టీసీ లాభాల్లో పయనించేలా చేస్తున్నారు. అయితే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నా.. వాళ్లకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారు అధికారులు.

ఆర్టీసీ డ్రైవర్ కు తేలుకాటు.. నిలిచిపోయిన బస్సు, అధికారుల తీరుపై ప్రయాణికుల మండిపాటు
Representative Image
Follow us on

ప్రయాణికులను సురక్షిత గమ్యస్థానాలను చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్లది కీలక పాత్ర. గంటల తరబడి విధులు నిర్వహిస్తూ ఆర్టీసీ లాభాల్లో పయనించేలా చేస్తున్నారు. అయితే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నా.. వాళ్లకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారు అధికారులు. తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ కు తేలు కుట్టిన ఘటన చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటన ఏపీలోని తిరువూరు డిపోలో జరిగింది. రాత్రి 10.30 గంటలకు డ్రైవర్ డిపో నుంచి  హైదరాబాద్‌ కు బయలుదేరాడు. అయితే బస్సును నడిపే క్రమంలో సీటు కింద తేలును గమనించలేదు. అయితే డ్రైవర్ ఆవిషయాన్ని గమనించగాపోవడం, తన డ్యూటీలో నిమగ్నమై ఉండటంతో తేలు ఒక్కసారిగా  కుట్టింది. దీంతో భయపడిపోయిన డ్రైవర్ బస్సును ఓ చోట ఆపాల్సి వచ్చింది.

డ్రైవర్ కు తీవ్ర నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రయాణికులు గంటకుపై ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి తెలుసుకున్న ఆర్టీసీ యాజమాన్యం రంగంలోకి దిగి మరో డ్రైవర్ ను పంపింది. ఆ డ్రైవర్ కూడా రావడం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ముప్పుతిప్పలు పడ్డారు.  ఈ ఘటనపై సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులను పూర్తిగా తనిఖీలు చేయకపోవడం వల్ల్ ఇలాంటి జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన ఆర్టీసీ పనితీరుపై ప్రశ్నలు తలెత్తెలా చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి