Andhra Pradesh: సిమెంట్ పోల్స్ పాతి.. రహదారికి అడ్డంగా కంచె వేసి.. నిర్వాసితుల ఆందోళన

|

Aug 03, 2022 | 1:12 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లాలోని గ్రీన్ ఫీల్డ్ రహదారిపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భూ నిర్వాసితులకు పరిహారం అందలేదంటూ మెంటాడ మండలంలోని జయితి సమీపంలో విజయనగర్...

Andhra Pradesh: సిమెంట్ పోల్స్ పాతి.. రహదారికి అడ్డంగా కంచె వేసి.. నిర్వాసితుల ఆందోళన
Green Field Express Way
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లాలోని గ్రీన్ ఫీల్డ్ రహదారిపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భూ నిర్వాసితులకు పరిహారం అందలేదంటూ మెంటాడ మండలంలోని జయితి సమీపంలో విజయనగర్ హేచరీస్ నిర్వాహకులు రహదారికి అడ్డంగా కంచె వేశారు. విజయనగర్ (Vizianagaram) హేచరీస్ ప్రైవేటు లిమిటెడ్ పేరు తో గ్రీన్ ఫీల్డ్ రహదారి కి అడ్డంగా కంచె నిర్మించారు. 400 నుంచి 880 నంబర్లు మధ్యలో రెండు వైపులా సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేశారు. తమ నుంచి తీసుకున్న భూమికి పరిహారం చెల్లించలేదని, అంతే కాకుండా మరికొంత భూమిని లాక్కున్నారని ఆరోపిస్తూ ఇద్దరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గిరిజనుల అభివృద్ధి కోసం, రవాణా సౌకర్యాల కల్పన కోసం నిర్మిస్తున్న గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మాణంపై నిరసన జ్వాలలు వేడెక్కుతున్నాయి. రైతులు దేశానికి వెన్నెముక అని చెప్పి, ఇప్పుడు భూములు లాక్కొని రోడ్డున పడేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారితో లాభం ఏమీ లేదని, మూడు కాలాల్లో సమృద్ధిగా పంటలు పండే భూములు పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

శతాబ్దాలుగా మన్యంలో మగ్గిపోయి, బాహ్య ప్రపంచంలో ఏమాత్రం సంబంధం లేకుండా నానా అవస్థలు పడుతున్న వారి అభివృద్ది కోసం గ్రీన్‌ ఫీల్డ్‌ సిక్స్‌ లైన్‌ రోడ్డు వేయాలని అధికారులు గతంలో నిర్ణయించారు. ఈ రోడ్డు నిర్మాణంతో గిరిజనుల చిరకాల కల నేరవేరుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మెంటాడ మండలంలోని జక్కువ నుంచి పాచిపెంట మండలం ఆలూరు గిరిజన గ్రామం వరకు సుమారు 31.66 పొడవున ఆరులైన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రం 1,060 కోట్లు విడుదల చేసింది. అందులో భాగంగా ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి. రహదారి పనులకు అటవీశాఖ నుంచి అభ్యంతరాలు లేవని, అనుమతులు ఇచ్చినట్లు అధికారులు గతంలోనే వెల్లడించారు.

ఈ రహదారి నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్ర మధ్య రవాణా, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. సకాలంలో రహదారి పనులు జరిగితే గిరిజన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని నిపుణలు చెబుతున్నారు. ఈ రహదారి కోసం వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులకు.. కేంద్రం నష్ట పరిహారం అందించిందని, నష్ట పరిహారం అందని రైతులు స్థానిక రెవెన్యూ తహసీల్దార్ ఆఫీస్ లకు వెళ్లి అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..