Andhra Pradesh: ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.. రాజమండ్రిలో పార్టీ నేతలతో ఇన్ఛార్జ్ మీటింగ్..

|

Feb 25, 2023 | 12:04 PM

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ అధ్యక్ష పదవికి గతంలోనే రాజీనామా చేసిన ఆయన.. కొన్నాళ్లు స్తబ్దుగా..

Andhra Pradesh: ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.. రాజమండ్రిలో పార్టీ నేతలతో ఇన్ఛార్జ్ మీటింగ్..
Ap Bjp
Follow us on

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ అధ్యక్ష పదవికి గతంలోనే రాజీనామా చేసిన ఆయన.. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నారు. తాజాగా.. బీజేపీ నుంచి టీడీపీలోకి చేరారు. దీంతో ఏపీ బీజేపీలో వర్గపోరుపై అధిష్టానం ఫోకస్‌ పెట్టింది. కాసేపట్లో రాజమండ్రికి పార్టీ ఇన్‌ఛార్జి, కేంద్రమంత్రి మురళీధరన్‌ వెళ్లనున్నారు. కన్నా ఎపిసోడ్‌ తర్వాత సోముపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా దిల్లీ కి వెళ్లి ఫిర్యాదులు చేశారు. దీంతో పార్టీ ఇన్‌ఛార్జి పర్యటనలో సోముకు పిలుపు అందకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మురళీధరన్‌ను కలిసేందుకు సోము వ్యతిరేకవర్గం ప్రయత్నిస్తుండడం గమనార్హం.

కాగా.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగు దేశం పార్టీలోకి చేరారు. టీడీపీ, జనసేన పార్టీలు కలసి పనిచేయాలన్నది రాజకీయ పక్షాల ఆకాంక్ష కాదని.. అది ప్రజల అభిమతమని వ్యాఖ్యానించారు. జగన్‌ను సాగనంపాలంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ నేతలుగా ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలని.. పొత్తుకు ఎంత వరకు అవకాశం ఉందో రెండు పార్టీల నేతలు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని కన్నా చెప్పడం చర్చనీయాశంగా మారింది.

అమరావతి అభివృద్ధి జరగాలంటే పార్టీలు ఏకం కావాలి. అధికార పార్టీ నేతలకు పాలనపై నమ్మకం లేదు. అందుకే ప్రజలు, ప్రతిపక్షాలను భయభ్రాంతుల్ని చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలపై నమ్మకం ఉంటే.. ఈ దాడులు ఎందుకు చేస్తున్నారని.. ఓటమి భయంతోనే ఇదంతా చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు రాజధాని అమరావతిపైనే ఆధారపడి ఉంది. 29 గ్రామాల సమస్య కాదు, రాష్ట్ర సమస్య. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబే సమర్థుడన్న ఉద్దేశంతోనే టీడీపీలోకి వచ్చాను.

ఇవి కూడా చదవండి

    – కన్నా లక్ష్మీ నారాయణ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..