విజయవాడ వాసులకు గుడ్ న్యూస్.. హైదారాబాద్ వెళ్లాల్సిన పనిలేదు.. ఫుల్‌ జోష్‌!

| Edited By: Balaraju Goud

Nov 20, 2024 | 5:07 PM

విజయవాడ వేదికగానే రాజధాని కార్యక్రమాలు మొత్తం కొనసాగుతూ ఉండటంతో అందుకు తగ్గట్టుగానే వీకెండ్ ఎంటర్టైన్మెంట్ను సిద్ధం చేసుకుంటూ ఏర్పాటు చేస్తున్నారు .

విజయవాడ వాసులకు గుడ్ న్యూస్.. హైదారాబాద్ వెళ్లాల్సిన పనిలేదు.. ఫుల్‌ జోష్‌!
Vijayawada
Follow us on

వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు ఇక మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకో వెళ్లాల్సిన అవసరం లేదు. విజయవాడ వేదికగా రాజధాని నడిబొడ్డున ఇకపై అల్ట్రా మోడ్రన్ హంగులతో బీజం పడబోతోంది. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ గా విజయవాడ ఉండబోతోంది. ఇప్పటికే విజయవాడను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న వేళ కార్పొరేట్ కంపెనీలు సైతం విజయవాడ వేదికగా ఎంటర్టైన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.

తాజాగా విజయవాడ నగరంలో అన్ని రకాల హంగులతో మాల్స్ మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్, గేమింగ్ జోన్స్, ఎంటర్టైన్‌మెంట్ క్లబ్బులు వెలుస్తుండగా, నగరం చుట్టుపక్కల గేమింగ్ జోన్స్ తో పాటు క్లబ్బులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే అందుకు అదనంగా విజయవాడలో యూత్ కోసం ముఖ్యంగా నగరంలో పబ్బులు సైతం వెలుస్తున్నాయి.

వీకెండ్ అంటే స్వతహాగా యూత్ అంతా ఎంజాయ్ చేసేందుకు పబ్బులు చుట్టూ పరిగెడుతుంటారు. అయితే హైదరాబాద్. బెంగళూరు, చెన్నైకి తగ్గట్టుగా విజయవాడలో పబ్బులు లేకపోవడంతో యువత ముఖ్యంగా చాలామంది వీకెండ్ వస్తే ఎంజాయ్‌మెంట్ కోసం ఈ మూడు పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఫ్రైడే ఈవినింగ్‌కి విజయవాడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉండటంతో ప్రస్తుతం ఆ పరిస్థితి ఇకపై పునరావృతం కాకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఎంటర్టైన్‌మెంట్‌ జోన్లు వెలుస్తున్నాయి.

విజయవాడ చుట్టుపక్కల మాల్స్, పబ్స్, ఎంటర్టైన్‌మెంట్ జోన్లు వెలుస్తూన్నాయి. తాజాగా విజయవాడ నగరంలో మరొక అధునాతనమైన హంగులతో పబ్బులు ఎర్పాటు అవుతున్నాయి. ఇప్పటివరకు విజయవాడలో ఉన్న నాలుగు ఐదు పబ్బులు కేవలం మల్టీప్లెక్స్ మాల్స్‌లో మాత్రమే ఉండటంతో ప్రస్తుతం యువత అవసరాలకు అనుగుణంగా నగరంలో మరిన్ని పబ్బులు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ముందుకు వచ్చారు. త్వరలోనే మరిన్ని పబ్బులు విజయవాడలో ఏర్పాటు అవుతూ ఉండటంతో యువత ఇకపై పక్క రాష్ట్రాలకు వెళ్లే అవకాశం లేకుండా ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని పబ్బు నిర్వాహకులు అంటున్నారు.

పబ్బులు అంటే కేవలం తాగడం, ఊగడం మాత్రమే కాదని అందుకు తగ్గట్టుగానే లైవ్ కన్సర్ట్, ఈవెంట్స్, ప్రత్యేకమైన స్టేజ్ షోలు ఏర్పాటు చేయడమే ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటి వరకు బెంగళూరు,చెన్నై, హైదరాబాదు లాంటి పట్టణాల్లో పబ్స్ ఏర్పాటు చేసిన అక్కడ ప్రత్యేకంగా వీకెండ్స్ లో లైవ్ కంసెట్స్ సెలబ్రిటీ షోలు నిర్వహించడం ద్వారా యువతను మరింత ఎట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాలకు పబ్ లకు వెళ్లే వాళ్లంతా కూడా లైవ్ కన్సర్ట్ కోసం తమ అభిమాన సింగర్స్, డాన్సర్స్, స్టేజ్ హోస్టులు, లైవ్ బ్యాండ్ల కోసమే వెళ్తున్నారని గ్రహించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే విజయవాడలో ఇకపై పబ్బులు ఏర్పాటు చేయడం అక్కడ ఈవెంట్స్ నిర్వహించడం లాంటివి చేపడుతున్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ఎక్కడికి పొదన్న సంకేతాలను స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు సైతం ఇక్కడి నుంచి తమ ఆపరేషన్ ప్రారంభించాయి.

ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ అందుబాటులో ఉండటం త్వరలో విజయవాడ వేదికగానే రాజధాని కార్యక్రమాలు మొత్తం కొనసాగుతూ ఉండటంతో అందుకు తగ్గట్టుగానే వీకెండ్ ఎంటర్టైన్మెంట్ను సిద్ధం చేసుకుంటూ ఏర్పాటు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం సైతం సహకారం అందిస్తూ ఉండటంతో నిబంధనలు మేరకే అన్ని పబ్బులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..