ఈడు గోల్డ్ ఎహే..! ఒంటి నిండా బంగారంతో అలంకార ప్రియుడి వద్దకు..

న్యూ ఇయర్ రోజు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల కొండపైకి వచ్చిన ఓ భక్తుడు అందరిని ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ దాదాపు 5 కిలోల బంగారు ఆభర ణాలు ధరించి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.

ఈడు గోల్డ్ ఎహే..! ఒంటి నిండా బంగారంతో అలంకార ప్రియుడి వద్దకు..
Gold Man Vijay Kumar

Edited By: Balaraju Goud

Updated on: Jan 01, 2025 | 12:25 PM

న్యూ ఇయర్ రోజు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల కొండపైకి వచ్చిన ఓ భక్తుడు అందరిని ఆకట్టుకున్నాడు. అలంకార ప్రియుడు శ్రీవెంకటేశ్వరుడి చెంత ఒక భక్తుడు భారీ ఆభరణాలతో దర్శనమిచ్చాడు. వెల కట్టలేని ఆభరణాలు వజ్ర వైఢూర్యాలతో భక్తులకు దర్శనమిచ్చే బంగారు స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుడు తిరుమల కొండపై అందరిని ఆకట్టుకున్నాడు.

బంగారం ఎక్కువగా మహిళలు వేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ దీనికి భిన్నంగా హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ ఒంటి నిండా బంగారంతో దర్శనమిచ్చాడు. దాదాపు 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు శ్రీవారిని దర్శించు కునేందుకు వేచి ఉన్న విజయ్ కుమార్ ధరించిన ఆభరణాలు భక్తుల దృష్టిని ఆయన వైపు మళ్లించాయి. మెడలో చేతికి ఇలా ఒళ్ళంతా బంగారు ఆభరణాలు ధరించిన విజయ్ కుమార్‌ను తోటి భక్తులు ఆసక్తిగా గమనించారు.

వీడియో చూడండి.. 

తరచూ తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి వస్తుండగా వచ్చిన ప్రతిసారీ బంగారంపై తనకున్న ఆసక్తి ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. పసిడిపై ఉన్న ప్రేమతో భారీ ఆభరణాలు చేయించుకుని ధరిస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. శ్రీవారికి పరమ భక్తుడై తిరుమలేశుడిని తరచూ దర్శించుకుంటూనే ఉన్నారు. తెలంగాణ హాకీ జోన్ సంయుక్త కార్యదర్శిగా హోప్ ఫౌండేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న విజయ్ కుమార్ మంగళవారం(డిసెంబర్ 31) విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..