ఉగ్ర కదలికల నేపథ్యంలో..తిరుపతిలో రెడ్ అలర్ట్
భారత్‌లోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు తమ మార్గాన్ని మార్చుకున్నారు. లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టులు శ్రీలంక ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. ఆరుగురు ఉగ్రవాదులు చెన్నైలోకి ప్రవేశించారని సమాచారం అందింది. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో తమిళనాడులో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు తమిళనాడులో గాలింపును ముమ్మరం చేశారు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని […]
భారత్‌లోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు తమ మార్గాన్ని మార్చుకున్నారు. లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టులు శ్రీలంక ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. ఆరుగురు ఉగ్రవాదులు చెన్నైలోకి ప్రవేశించారని సమాచారం అందింది. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో తమిళనాడులో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు తమిళనాడులో గాలింపును ముమ్మరం చేశారు.
దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ సూచించారు.