Chandrababu: ‘నేను, పవన్ హామీ ఇస్తున్నాం – మన రాజధాని అమరావతే’.. భోగి కార్యక్రమంలో టీడీపీ అధినేత..
సంక్రాంతి సందర్భంగా రాజధాని నగరంలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. భోగి మంటల కార్యక్రమం తరువాత సభ ఏర్పాటు చేశారు. ముందుగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు. ఒక పక్క బాధ,ఒక పక్క కోపం ఉందన్నారు. భవిష్యత్యులో అమరావతి కేంద్రంగా అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు.

సంక్రాంతి సందర్భంగా రాజధాని నగరంలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. భోగి మంటల కార్యక్రమం తరువాత సభ ఏర్పాటు చేశారు. ముందుగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు. ఒక పక్క బాధ,ఒక పక్క కోపం ఉందన్నారు. భవిష్యత్యులో అమరావతి కేంద్రంగా అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు వల్ల అంతా నాశనమయ్యామని ఆరోపించారు. ఐదేళ్లలో రైతులు పడ్డ ఇబ్బందులు పగవాడికి కూడా రాకూడదన్నారు. నేను,పవన్ హామీ ఇస్తున్నాం మన రాజధాని అమరావతే అన్నారు. త్వరలో అమరావతి నుంచి పేదల పాలన ప్రారంభం అవుతుందని జోస్యం చెప్పారు. 85 రోజుల కౌంట్ డౌన్ అమరావతి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. భవిష్యత్లో యువతకు ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ద్యేయంగా ముందుకెళ్తామన్నారు.
వైసీపీ విముక్త రాష్ట్రం కోసం అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని చెప్పి మోసం చేశారన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలని దిశానిర్ధేశం చేశారు. వచ్చే ఏడాది ఇదే ప్రాంతంలో సంక్రాంతి వైభవంగా జరుపుకునే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభ అనంతరం మధ్యాహ్నం ఉండవల్లిలోని తన నివాసంలో పవన్ తో కలిసి భోజనం చేయనున్నారు చంద్రబాబు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో నారా వారి పల్లెకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత నారా వారి పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇప్పటికే నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు నారా వారి పల్లెకు చేరుకున్నారు. చంద్రబాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక నాయకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








