TDP Twitter account hack: దేశంలో ఇటీవల ట్విట్టర్ హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) ట్విట్ చేసి వెల్లడించారు. హ్యాకర్లు పార్టీ ట్విట్టర్ అకౌంట్‌లో హ్యాకర్లు వివిధ రకాల పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లోకేశ్ వివరించారు. పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. పార్టీ సభ్యలంతా గమనించాలని సూచించారు. ట్విట్టర్ ఖాతను పునరుద్ధరించడానికి ట్విట్టర్ అధికారులను సంప్రదించినట్లు వెల్లడించారు. కాగా.. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ ఘటన పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఎవరు చేశారు..? కావాలనే చేశారా..? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.
— Lokesh Nara (@naralokesh) March 19, 2022
కాగా.. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ పై ఇప్పటికే.. ట్విట్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటున్నారు. అంతకుముందు కూడా దేశంలోని పలువురు కీలక నేతల ట్విట్టర్ అకౌంట్‌లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే.
Also Read:
గుటకలేస్తూ నీరు తాగుతున్న నల్ల పిల్లి !! ఫన్నీ వీడియో చూడాల్సిందే..!
Viral News: ఎయిర్‌పోర్టులో ఐపీఎస్ అధికారిపై అనుమానం.. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే షాక్..!