AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: చిన్నాన్నే హంతకుడు.. అక్రమ సంబంధం బయటపడుతుందని బాలుడిని దారుణంగా..

Boy murder case: ఏపీలో చిత్తూరు జిల్లా కలికిరిలో బాలుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎనిదేళ్ల ఉదయ్ కిరణ్ ను దుండగులు చెట్టుకు

AP Crime News: చిన్నాన్నే హంతకుడు.. అక్రమ సంబంధం బయటపడుతుందని బాలుడిని దారుణంగా..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Mar 19, 2022 | 9:25 AM

Share

Boy murder case: ఏపీలో చిత్తూరు జిల్లా కలికిరిలో బాలుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎనిదేళ్ల ఉదయ్ కిరణ్ ను దుండగులు చెట్టుకు ఉరివేసి చంపారు. ఈ ఘటన ఈ నెల 12న కలికిరి మండలంలోని అద్దవారిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉదయ్ కిరణ్ హత్య కేసును చిత్తూరు జిల్లా పోలీసులు చేధించారు. సొంత బాబాయే హాంతకుడిగా పోలీసులు తేల్చారు. సొంత చిన్నాయన సహదేవ గ్రామంలోని రాజేశ్వరి అనే యువతితో ఉన్న అక్రమ సంబంధం బయట పెడతాడన్న నేపంతో ఉదయ్ కిరణ్ హత్య జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. సహదేవ, రాజేశ్వరీల ప్రేమ వ్యవహారాన్ని చూసిన ఉదయ్ కిరణ్ ఎవరికైనా చెబుతాడన్న భయంతో సహదేవ, ప్రియురాలు రాజేశ్వరి హతమార్చారని పోలీసులు పేర్కొన్నారు. వారిని ఈ రోజు రిమాండ్ కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. ఉదయ్ కిరణ్ కనింపచకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి కోసం కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని చెట్టుకు ఉరివేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read:

Watch Video: అరబిక్ కుతు పాటకు స్టెప్పులేసిన టీమిండియా ప్లేయర్లు.. వేరే లెవల్ అంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో

The Kashmir Files: ‘కశ్మీర్ ఫైల్స్’ థియేటర్‌లో జై పాకిస్థాన్ నినాదాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే