Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. శుక్రవారం ఈ ప్రాంతంలో వర్షాలు.. ఇదిగో తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేవలం ఉదయం వేళ కొంచెం చలి ఉంటోంది.. ఆ తర్వాత ఎండలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. శుక్రవారం ఈ ప్రాంతంలో వర్షాలు.. ఇదిగో తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్..
Telangana - Andhra Pradesh Weather Report

Updated on: Feb 19, 2026 | 3:20 PM

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేవలం ఉదయం వేళ కొంచెం చలి ఉంటోంది.. ఆ తర్వాత ఎండలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి అల్పపీడనం హిందూ మహాసముద్రం – అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక వైపు ప్రయాణించి రాబోయే 24 గంటల్లో తక్కువగా గుర్తించబడే అవకాశం ఉంది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానములో ఈశాన్య దిశగా – దక్షిణ కోస్తా ఆంధ్రప్రదశ్, రాయలసీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం – దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్:-

గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ:-

గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి ఒకమోస్తరు వర్షాలు కురిసే అవకాశము ఉంది.

గమనిక :- ఈరోజు రాయలసీమ లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది. రేపటి నుండి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. కోస్తాంద్ర లో రాగల 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా ఆగ్నేయ దిశ నుండి వీచుచున్నవి. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు.. అంటే.. గురువారం, శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us