AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

ఏపీ, తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్నిచోట్ల పొడి వాతావరణం నెలకొంది. అయితే రానున్న కొద్ది రోజుల పాటు వానలు ఇలాగే కొనసాగనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Rain Alert: ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..
Rains
Venkatrao Lella
|

Updated on: Aug 31, 2026 | 3:56 PM

Share

గ్యాంగెటిక్ పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడనం 31 ఆగస్టు 2026 ఉదయం 08:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా – గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఈరోజు అమృత్‌సర్, పాటియాలా, నజీబాబాద్, బస్తీ, గంగా పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఉన్న సుస్పష్టమైన అల్పపీడన కేంద్రం గుండా ప్రయాణిస్తోంది. అక్కడ నుండి ఆగ్నేయ దిశగా తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఈరోజు ,రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే మూడ్రోజుల పాటు బలమైన ఉపరితల గాలులు 30 నుంచి 40 కి.మీ వేగంతో తెలంగాణ రాష్ట్రంలో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీలో కూడా వర్షాలు..

ఇవి కూడా చదవండి

గంగాపరీవాహక పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీర ప్రాంతము, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన నిన్నటి సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం ఇవాళ అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని హెచ్చరించింది. వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. వర్షాల సమయంలో హోర్డింగ్స్, కరెంట్ స్తంభాల వద్ద ఉండవద్దని సూచించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని ,దీని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రానున్న కొద్ది రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది.

Follow Us