AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో కొత్త పింఛన్ల మంజూరుకు లైన్ క్లియర్.. అప్పటినుంచే డబ్బులు పంపిణీ.. రెడీగా ఉండండి..

తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల పంపిణీపై కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే కొత్త పింఛన్ల మంజూరుకు సిద్దమవుతోంది. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. ఆగస్ట్ 31తో అప్లికేషన్ గడువు ముగియనుంది. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేపట్టనున్నారు. ఆ తర్వాత లబ్దిదారుల జాబితా సిద్దం చయనున్నారు.

Telangana: తెలంగాణలో కొత్త పింఛన్ల మంజూరుకు లైన్ క్లియర్.. అప్పటినుంచే డబ్బులు పంపిణీ.. రెడీగా ఉండండి..
Telangana New Pensions 2026
Venkatrao Lella
|

Updated on: Aug 31, 2026 | 3:27 PM

Share

తెలంగాణలో కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. రేవంత్ సర్కార్ కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అర్హులైనవారు పింఛన్లను పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గత కొద్ది రోజులుగా అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఆగస్ట్ 31తో గడువు ముగియనుంది. దీంతో అర్హత ఉండి పింఛన్లు పొందాలనుకునేవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సోమవారంతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం అర్హులైనవారికి కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నారు. అర్హులైన ప్రతీఒక్కరికీ పింఛన్లు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.

ఐదు కేటగిరీల్లో పింఛన్ల కోసం ప్రభుత్వం గత కొంతకాలంగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆదివారం వరకు చేయూత పింఛన్ల కోసం 4,34,854 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇవాళ చివరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇంకా 50 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్నటివరకు కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. దీంతో కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అర్హులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మంది సామాజిక పింఛన్లను కొత్తగా అందించాలని ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో వితంతువులు అత్యధికంగా 2,64,815 మంది ఉండగా.. ఒంటరి మహిళలు 26,057 మంది ఉన్నారు. ఇక దివ్యాంగులు 1,07,171 మంది దరఖాస్తు చేసుకోగా.. గీత కార్మికులు 26,343, చేనేత కార్మికులు 10,468 మంది ఉన్నారు. ప్రభుత్వం పెట్టుకున్న 2.50 లక్షల లక్ష్యం కంటే దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం వీరిలో అర్హులను ఎంపిక చేయనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులను పరిశీలించనుండగా.. పట్ణణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్లు దరఖాస్తును పరిశీలిస్తారు. అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన కోటా ప్రకారం తుది జాబితా సిద్దం చేయనున్నారు. పరిశీలన అనంతరం అర్హుల సంఖ్య తగ్గే అవకాశముంది. లబ్దిదారుల జాబితా సిద్దం చేసిన అనంతరం కొత్త పించన్లను మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం నేరుగా బ్యాంక్ అకౌంట్లోకే పించన్లను జమ చేేస్తోంది. గతంలో పోస్టాఫీస్ ద్వారా అందించా.. ఇప్పుడు లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తోంది. దీంతో కొత్త పింఛన్ల సొమ్ము ఎప్పుడు అందుతుందా అని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

Follow Us