Tarakaratna-Nara Lokesh: తనను అలా చూసి నా గుండె పగిలిపోయింది.. తారకరత్న హెల్త్ పై నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..

ఆదివారం ఉదయం... జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకుని తమ సోదరుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ యువనేత నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Tarakaratna-Nara Lokesh: తనను అలా చూసి నా గుండె పగిలిపోయింది.. తారకరత్న హెల్త్ పై నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..
Nara Lokesh, Tarakaratna

Edited By:

Updated on: Feb 01, 2023 | 3:41 PM

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్‏గానే ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పం సమీపంలో నారోలోకేష్, బాలకృష్ణలతో కలిసి యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. మాసివ్ హార్ట్ అటాక్ గా నిర్దారించారు వైద్యులు. ప్రస్తుతం తారకరత్నకు బెంగుళూరులోని నారాయణ హృదలయా ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. హీరో బాలకృష్ణతోపాటు.. చంద్రబాబు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే తారకరత్న భార్య అలేఖ్య.. బాలకృష్ణ కుటుంబం నారాయణ హృదలయా ఆసుపత్రిలో ఉండగా.. ఆదివారం ఉదయం… జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకుని తమ సోదరుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ యువనేత నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

“మా బంధువు తారకరత్నతో నేను ఎప్పుడూ ఎంతో సన్నిహిత బంధాన్ని పంచుకున్నాను. అతను అలా తీవ్రమైన గుండెపోటుతో బాధపడడం చూసి నా గుండె పగిలిపోయింది. మేమిద్దరం ఇటీవలే కలుసుకున్నాం. జీవితం.. సినిమాలు.. రాజకీయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం” అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు లోకేష్.

ఇవి కూడా చదవండి

మరోవైపు బెంగుళూరులోని నారాయణ హృదలయా ఆసుపత్రిలో తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆయన ఇంకా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నారని.. తర్వలోనే కోలుకుంటారని ఎన్టీఆర్ వెల్లడించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు వైద్యులను సంప్రదిస్తూ.. తారకరత్న హెల్త్ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.