AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ASHOK VS MEESALA GEETHA: మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు షాకిచ్చిన టీడీపీ అధిష్టానం.. సర్క్యూలర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గీత..

విజయనగరం జిల్లా టీడీపీలో గత కొద్దిరోజులుగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది.

ASHOK VS MEESALA GEETHA: మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు షాకిచ్చిన టీడీపీ అధిష్టానం.. సర్క్యూలర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గీత..
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 27, 2020 | 7:19 AM

Share

ASHOK VS MEESALA GEETHA: విజయనగరం జిల్లా టీడీపీలో గత కొద్దిరోజులుగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు మీసాల గీతకు అర్హత లేదంటూ పరోక్షంగా తెల్చేసింది. ఆమేరకు శనివారం టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. అంతేకాకుండా పార్టీ ఇంచార్జ్‌లు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలని, వారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మాత్రమే కార్యకర్తలు వెళ్లాలని స్పష్టం చేసింది. కాగా, ఈ సర్క్యూలర్‌తో గీతకు చెక్ పెట్టినట్లయింది.

సర్క్యూలర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గీత.. మరోవైపు టీడీపీ రాష్ట్ర నాయకత్వం జారీ చేసిన సర్క్యూలర్‌పై మీసాల గీత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. టీడీపీ సర్క్యూలర్ జారీ చేయడంపై స్పందించిన ఆమె.. ఏ ఒక్కరికో పార్టీని తాకట్టు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. జిల్లాలో పార్టీ ఓటమికి ఎవరు కారణమో ఆలోచించుకోవాలన్నారు. నలభై ఏళ్లుగా జిల్లా పార్టీలో అశోక్‌ని ఎదిరించిన వారు లేరని, ఇప్పటికీ పార్టీ కార్యాలయంపై అశోక్‌కి వ్యతిరేకంగా ఎవరూ మాట్లడలేరని గీత అన్నారు. కనీస అనుభవం లేని వారు తమపై నాయకులుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎక్కవ శాతం కార్యకర్తలు ప్రస్తుత కార్యాలయానికి వెళ్లలేక పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరేం చెప్పినా నూతన కార్యాలయం ప్రారంభించే వరకు తాను ఏర్పాటు చేసి పార్టీ కార్యాలయం కొనసాగుతుందని గీత తేల్చి చెప్పారు. పార్టీ బాగుపడటం కోసం ఎంతవరకు అయిన వెళ్తానని స్పష్టం చేశారు. అయితే, పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పని చేసినా తనపై చర్యలు తీసుకోవచ్చునని అన్నారు.

Also read:

వచ్చే ఏడాది నుంచి ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్‌కు మంచి రోజులు.. ఎందుకో తెలియాలంటే..

డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టనున్న అలనాటి హీరోయిన్.. ‘త్రిభంగా’తో రానున్న బాలీవుడ్ భామ..