AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: ప్రశాంతమైన కుప్పం ను ఉద్రిక్తంగా మారుస్తున్నారు.. వైసీపీ పాలనపై చంద్రబాబు ఫైర్

చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam)లో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని వైసీపీ తీసుకురావడం దురదృష్టకరమని టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం అయిపోయిందన్నందుకు హోటల్...

Chandrababu Naidu: ప్రశాంతమైన కుప్పం ను ఉద్రిక్తంగా మారుస్తున్నారు.. వైసీపీ పాలనపై చంద్రబాబు ఫైర్
Chandrababu
Ganesh Mudavath
|

Updated on: May 16, 2022 | 12:49 PM

Share

చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam)లో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని వైసీపీ తీసుకురావడం దురదృష్టకరమని టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం అయిపోయిందన్నందుకు హోటల్ పై దాడి చేయండ దారుణం అని మండిపడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి, మహిళలను బెదిరించి భయాందోళన కలిగించారని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్ నిర్వాహకులను చంపేస్తాం…హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కఠిన చర్యలతో క్రిమినల్స్ కు ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

కుప్పం పట్టణం బైపాస్‌ వద్ద ఉన్న ఓ దాబాలో వైసీపీ నాయకులు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరలైంది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్‌, మరో కౌన్సిలర్‌ కుమారుడు, వారి అనుచరులు దాబాపై దాడి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం వైసీపీ నాయకులు దాబాకు వెళ్లగా భోజనం అయిపోయిందని నిర్వాహకులు చెప్పారు. శనివారం రాత్రి మళ్లీ వచ్చి ‘మొన్న మాకు భోజనం లేదన్నారే..’ అని దాబాలో బల్లలు, కుర్చీలు ధ్వంసం చేశారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మాట్లాడితే చంపేస్తామని బెదిరించారని వాపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Kangana Ranaut: పట్టు చీర, నుదుటిన బొట్టు, శ్రీవారి సన్నిధిలో పుత్తడిబొమ్మల మెరిసిన ఫైర్ బ్రాండ్ కంగనా..

Railway News: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే..