Punugu Pilli: రోడ్డు ప్రమాదంలో అరుదైన పునుగు పిల్లి మృతి.. దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..?

అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లి మృతి చెందింది. కడప జిల్లాలో అట్లూరు మండలం ఫారెస్ట్ అతి సమీపంలో సంఘటన చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకం కోసం పునుగు తైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది.

Punugu Pilli: రోడ్డు ప్రమాదంలో అరుదైన పునుగు పిల్లి మృతి.. దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..?
Punugu Pilli
Follow us
Surya Kala

|

Updated on: May 16, 2022 | 1:31 PM

Punugu Pilli: కడప జిల్లాలో అంతరించిపోతు‌న్న ఎంతో అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లి మృతి చెందింది. అట్లూరు మండలం ఫారెస్ట్ అతి సమీపంలో సంఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల భాగాన దెబ్బ తగిలి పునుగు పిల్లి మృతి చెందింది. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పునుగు పిల్లి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిద్ధవటం రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కు పునుగుపిల్లి మరణంపై  ఫారెస్ట్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి అభిషేకంలో పునుగుపిల్లి తైలాన్ని టీటీడీ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.

  1. పునుగు పిల్లి ప్రత్యేకతలు: ఈ పునుగు పిల్లులలో 38 జాతులు ఉన్నాయి. పునుగు పిల్లి భారత్, శ్రీలంక, మియాన్మార్, భూటాన్, థాయ్ లాండ్, సింగపూర్, కంబోడియా, మలేషియా, జపాన్ వగైరా దేశాల్లో కనిపిస్తుంది. అయితే ఆసియా రకానికి విశిష్టత ఉంది.  దీని  గ్రంథుల నుండి జవాది లేదా పునుగు అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. అత్యంత ఖరీదైంది ఈ సుగంధ ద్రవ్యం.
  2. వెంకన్న అభిషేకంలో పునుగు తైలం: తిరుపతి వెంకన్నకు ప్రతి శుక్రవారం అభిషేకం అనంతరం ఈ పునుగు తైలాన్ని స్వామివారి విగ్రహానికి పులుముతారు.  కేంద్ర ప్రభుత్వం వన్య ప్రాణ సంరక్షణా చట్టం 1972లో తెచ్చిన అనంతరం ఈ పునుగులను టీటీడీ అధికారులు గోశాలలో  పెంచేవారు. వాటి నుంచి తైలం తీసేవారు. అయితే జీవకారుణ్య పర్యావరణ సంరక్షణా సంఘాలు గోశాలలో పునుగు పిల్లుల పెంపకంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
  3. ప్రత్యేక విధానంలో పునుగు తైలం : స్వామివారి అభిషేకం కోసం పునుగు తైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడ వంటి గదిలో ఈ పునుగు పిల్లిని ఉంచుతారు. దీని పైభాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. ఆ రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు. రెండు సంవత్సరాల వయస్సు అనంతరం ప్రతి పది రోజులకు ఒకసారి పునుగు పిల్లి.. ఈ చందనపు కర్రకు చర్మాన్ని రుద్దుకుంటుంది. ఈ సమయంలో పునుగు చర్మంద్వారా వెలువడే పదార్ధాన్నే పునుగు తైలం అని అంటారు. దీనిని స్వామివారి అభిషేకంలో వినియోగిస్తారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..