తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, బాలకృష్ణతో పాటు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈ సభలో చంద్రబాబు నాయుడు ఎవరూ ఊహించని విధంగా తమ పార్టీ మొదటి విడత మేనిఫేస్టోను ప్రకటించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ అనే పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు
2. తల్లి వందనం పథకం కింద ప్రతి బిడ్డ చదువుకు ఏటా రూ.15 వేలు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి వర్తింపు
3. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం
4.ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతినెల రూ.1500 సాయం
5. యువత కోసం యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి
6. రైతుల కోసం అన్నదాత కార్యక్రమం కింద ప్రతిరైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం
7.ఇంటింటికీ మంచినీటి పథకం కింద ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు
8.పూర్ టూ రిచ్ పథకం కింద పేదలను సంపన్నులుగా చేయడం
9. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెచ్చి అండగా నిలవడం
10. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత