మీరు మరో బోధిధర్మలా కనిపిస్తున్నారు… ఆనందయ్యకు లేఖ రాసిన సోమిరెడ్డి

|

May 30, 2021 | 2:54 PM

రాజకీయాలకు అతీతంగా అందరూ మీకు అండగా నిలుస్తున్నారు. ప్రజలందరూ దేవుడిగా భావిస్తున్న మిమ్మల్ని భద్రత పేరుతో...

మీరు మరో బోధిధర్మలా కనిపిస్తున్నారు... ఆనందయ్యకు లేఖ రాసిన సోమిరెడ్డి
Somireddy
Follow us on

కృష్ణపట్నం ఆనందయ్యకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు. మీరు ఇచ్చే మందుతో మీ ఖ్యాతి జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. రాజకీయాలకు అతీతంగా అందరూ మీకు అండగా నిలుస్తున్నారు. ప్రజలందరూ దేవుడిగా భావిస్తున్న మిమ్మల్ని భద్రత పేరుతో నిర్బంధించడంపై చాలా బాధపడుతున్నాం అంటూ సోమిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
జైలులో ఖైదీకి ఉండే స్వేచ్ఛ కూడా మీకు లేకుండా చేయడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మీకు భద్రత కల్పించకపోయినా కృష్ణపట్నం ఊరుఊరంతా అండగా ఉంది.. వాళ్లే మీకు రక్షణ కల్పిస్తారు… మీపై కొందరు పెడుతున్న ఒత్తిడిని చూస్తే మీ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది అని అన్నారు. నిజంగా మీకు భద్రత కల్పించాలనుకుంటే నెల్లూరులో అనేక అవకాశాలున్నాయి..

ప్రైవేటు సంస్థ ఆధీనంలోని వందల మందికి వంట చేసే సౌకర్యం ఉన్న భవనాల్లో నిర్బంధించినపుడే వారి ఉద్దేశం స్పష్టమవుతోంది అని తెలిపారు. వైసీపీ నాయకులకు అధికారులకు వారి సన్నిహితులకు మీ మందు అందించిన తర్వాతే సామాన్యులకు పంపిణీకి అనుమతి ఇచ్చేలా ఉన్నారు. ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే మీకు నిర్బంధం నుంచి విముక్తి లభిస్తుందని భావిస్తున్నాం..మీ భద్రత, స్వేచ్ఛ విషయంలో స్థానిక ఎమ్మెల్యేని కాదని ఎవరూ జోక్యం చేసుకోలేని పరిస్థితి వచ్చింది.

మీ గొప్పతనం తెలుసుకుని దేశంలోనే రెండో అత్యున్నత పౌరుడైన ఉప రాష్ట్రపతి నుంచి జిల్లా నాయకుల వరకూ అందరూ స్పందిస్తున్నారు..మద్దతు పలుకుతున్నారు. ప్రపంచానికి ఒక ఆపద్బాంధవుడిలా నిలిచిన మిమ్మల్ని ప్రజలు దేవుడిలా భావిస్తున్నారు. మరో బోధిధర్మలా కీర్తిస్తున్నారు..

ప్రస్తుత పరిస్థితుల్లో మీ అవసరం ప్రజలకు ఎంతో ఉంది.. ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా పోరాడి విజయుడివై బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..

ఇవి కూడా చదవండి : TS Cabinet Meeting Live: మరికాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. లాక్‌డౌన్ పొడగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..

JR NTR: నెవ్వర్ బిఫోర్‌ క్యారెక్టర్‌లో ఎన్టీ రామారావు.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అంటున్న కొర‌టాల శివ‌