Chandrababu: తిరుమలకు చంద్రబాబు దంపతులు.. స్వాగతం పలికిన టీటీడీ అధికారులు

|

Nov 30, 2023 | 9:28 PM

తిరుమల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లే దారిలో పలుచోట్ల చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే చంద్రబాబు బస చేశారు.

Chandrababu: తిరుమలకు చంద్రబాబు దంపతులు.. స్వాగతం పలికిన టీటీడీ అధికారులు
Chandrababu
Follow us on

తిరుమల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లే దారిలో పలుచోట్ల చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే చంద్రబాబు బస చేశారు. ఉదయం శ్రీవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకుంటారు. తిరుమల అతిథి గృహం బయట వేచి ఉన్న కార్యకర్తల వద్దకు చంద్రబాబు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.

నారా భువనేశ్వరి, చంద్రబాబునాయుడు తిరుమలకు చేరుకోగా.. వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీగాయత్రీ నిలయం అతిధిగృహం వద్ద చంద్రబాబుకు పుష్పగుచ్చంతో టీటీడీ రిస్పెషన్ అధికారి స్వాగతం పలికారు. చంద్రబాబును కలిసేందుకు గెస్ట్ హౌస్ వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

అందర్ని అప్యాయంగా పలికిరించిన చంద్రబాబు గెస్ట్ హౌస్ లోకి వెళ్లిపోయారు. గురువారం రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం అమరావతికి రానున్నారు.

డిసెంబర్‌ 2న విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకోనున్నారు. డిసెంబర్‌ 3న సింహాచలం వెళ్లి అప్పన్న స్వామి దర్శనం చేసుకుంటారు. డిసెంబర్‌ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి చంద్రబాబు వెళ్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..