Andhra Pradesh: అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోండి.. వైసీపీ నేతల తీరుపై టీడీపీ ఫిర్యాదు

టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య విషయంపై టీడీపీ(TDP) , వైసీపీ (YCP) మధ్య మాటల యుద్ధం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని..

Andhra Pradesh: అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోండి.. వైసీపీ నేతల తీరుపై టీడీపీ ఫిర్యాదు
Tdp Leaders Complaint
Follow us

|

Updated on: Aug 05, 2022 | 12:39 PM

టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య విషయంపై టీడీపీ(TDP) , వైసీపీ (YCP) మధ్య మాటల యుద్ధం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైసీపీ లీడర్ దేవందర్ రెడ్డిపై సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేశారు. ఇవాళ (శుక్రవారం) ఎంపీ విజయసాయిరెడ్డి (MP.Vijayasai Reddy) పై వెస్ట్ జోన్ డీసీపీకి తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్న్స, దుర్గ ప్రసాద్ ల బృందం ఫిర్యాదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ పై సోషల్ మీడియాలో దుస్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉమా మహేశ్వరి మరణానికి కారణం చంద్రబాబు, లోకేశ్ అంటూ విజయ సాయి, దేవేందర్ రెడ్డి ట్వీట్లు చేశారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ విజయ్ సాయి రెడ్డీ తో పాటు ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దివంగత నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె ఉమామహేశ్వరి సూసైడ్ చేసుకున్నారు. ఆమె హఠాన్మరణంతో నందమూరి ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. అయితే..మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఉమామహేశ్వరి ఎన్టీఆర్ చివరి కూతురు. ఇటీవలే ఉమామహేశ్వర కుమార్తె పెళ్లి జరిగింది. ఆ నిశ్చితార్ధ సమయంలోనే చాలా రోజుల తర్వాత చంద్రబాబు దగ్గుబాటిని కలిశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Latest Articles