Andhra Pradesh: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. నిజమని తేలితే వేటు!
ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ చిత్రంతో ఉన్న వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఎంపీపై వేటు వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. మహిళా సంఘాలు ఆందోళనలకు దిగాయి.
MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖచిత్రంతో వైరల్ అవుతున్న న్యూడ్ వీడియో ఆయనదేనా? లేదంటే గిట్టని వాళ్లు చేసిన మార్ఫింగ్ మాయా? ఎంపీ నగ్నచిత్రంపై పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్‌గా ఉంది. ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. నిజమని తేలితే సస్పెండ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అందులో ఉన్నది ఆయనే అయితే.. వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదూ ఎంపీ పదవికి ఎసరొచ్చే అవకాశాలున్నాయి. అయితే అదంతా ఫేక్ అని కొట్టిపడేస్తున్న మాధవ్ మాటల్లో నిజమెంత? అదే.. ఇప్పుడు తేలాల్సి ఉంది. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించాడు మాధవ్. నిజానికి రాయడానికి, చూపడానికి కూడా ఇబ్బందికర పద్దతిలో అసభ్యంగా కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం రేపింది. ప్రత్యర్థులు గోరంట్లను చెడుగుడు ఆడుకుంటున్నారు. అయితే ఆ వీడియో తనది కాదని.. టీడీపీ(Telugu Desam party) కుట్ర అని ఆరోపించాడు మాధవ్.
సీఐగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు గోరంట్ల మాధవ్. టీడీపీ హయాంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల్ని తిట్టడంతో.. గోరంట్ల మీసం మెలేస్తూ సవాల్ విసురుతూ హాట్ టాపిక్‌గా మారాడు. పోలీస్ అధికారిగానే కాదూ పొలిటికల్ లీడర్‌గానూ టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారిపోయారు.వైరల్ అవుతున్న గోరంట్ల వీడియోపై ప్రభుత్వ సలహదారు సజ్జల స్పందించారు. మార్ఫింగా కాదని తేలితే చర్యలుంటాయన్నారు. గోరంట్ల వివాదంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా స్పందించారు. వీడియో వాస్తవమైతే చర్యలు తప్పవన్నారు. అయితే బాధ్యత గల ఎంపీగా ఉంటూ ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల సమస్యలపై పరిష్కరించాల్సిన ఎంపీ.. మహిళతో రాసలీలలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మాధవ్ తీరుపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. ఎంపీ పదవికి మాధవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎంపీ తీరు ఉందని మండిపడుతున్నారు. గోరంట్ల వీడియో నిజమా కాదా..? పార్టీ ఎలాంటి నిర్ణయంతో ముందుకెళ్తుందన్నది వేచి చూడాల్సిన అంశం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..