AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viveka Murder Case: గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారు.. వివేకా హత్య కేసు బదిలీపై ప్రతిపక్షాల ఘాటు విమర్శలు..

వివేకా హత్య కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు పై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత బాబాయి హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ కావడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు...

Viveka Murder Case: గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారు.. వివేకా హత్య కేసు బదిలీపై ప్రతిపక్షాల ఘాటు విమర్శలు..
Achennaidu
Ganesh Mudavath
|

Updated on: Nov 29, 2022 | 6:13 PM

Share

వివేకా హత్య కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు పై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత బాబాయి హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ కావడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సీఎం జగన్ సీఎంగా ఉండగా ఇలా జరగడం బాధాకరమన్న చంద్రబాబు.. తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ!అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, సీఎం జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ కావడం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖకు మాయని మచ్చ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. వివేకా హత్య కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో అచ్చెన్న స్పందించారు. తనలో ఏమాత్రం నైతికత మిగిలి ఉన్నా జగన్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ చేయడంపై జగన్‌ ఏం సమాధానం చెబుతారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రశ్నించారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు.. తాడేపల్లి ప్యాలెస్‌ ప్రమేయాన్ని బహిర్గతం చేసినట్లు అయిందని ఎద్దేవా చేశారు. జగన్‌ బ్యాచ్‌ పథకం ప్రకారమే గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని, ఈ విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వెల్లడైందని చెప్పారు.

వైఎస్‌ వివేకా రెడ్డి హత్యకు భారీగా కుట్ర జరిగింది. సాక్ష్యాలు ధ్వంసం చేశారు. న్యాయం జరిగిందని బాధితులు తెలుసుకునే తరహాలో ఉండాలి. కానీ ఇక్కడ అది కనిపించడం లేదు. బాధితులు న్యాయం జరగాలని కోరే హక్కు ఉంది. ప్రస్తుతం ఉన్న చోట న్యాయమైన విచారణ జరగకపోవచ్చనే అనుమానాలు ఉన్నాయి. దర్యాప్తు స్వతంత్రంగా జరగాలంటే కేసును మరోచోటకు బదిలీ చేయాలనడంలో తప్పు లేదు. విచారణ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా లేకపోతే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పోతుంది.

       – సుప్రీంకోర్టు ధర్మాసనం

ఇవి కూడా చదవండి

కాగా.. ఇన్నాళ్లు ఏపీ కేంద్రంగా జరుగుతున్న వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌కు బదిలీ అయింది. కేసును మరో రాష్ట్రానికిదిలీ చేయాలన్న వివేకా కూతురు సునీత పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విస్తృత స్థాయిలో జరిగిన కుట్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆధారాలను మాయం చేశారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్‌ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ విచారణపై వివేకా కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వివరించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..