Nara Lokesh: నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర.. జనంతో మమేకమవుతున్న యువ నేత

|

Mar 18, 2023 | 8:02 AM

లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తుంది. దారిపొడవునా జనంతో మమేకమవుతున్నారు లోకేశ్. ఆప్యాయంగా పలకరిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.

Nara Lokesh: నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర.. జనంతో మమేకమవుతున్న యువ నేత
Nara Lokesh Padayatra
Follow us on

తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర నిర్వీరామంగా కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లాను దాటుకొని శ్రీ సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించింది లోకేశ్ పాదయాత్ర. ఇవాళ ఉదయం శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులోని చీకటిమానిపల్లి నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. శ్రీసత్యసాయి జిల్లాకు చేరుకున్న లోకేశ్ పాదయాత్రకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. కేరళ వాయిద్యాలు, కోలాటం, చెక్కభజనతోపాటు స్వాగతం పలికారు. రాత్రి చీకటిమానిపల్లి, గంగసానిపల్లి మధ్యలో ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ లో బస చేశారు లోకేశ్‌.

ఇక లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తుంది. దారిపొడవునా జనంతో మమేకమవుతున్నారు లోకేశ్. ఆప్యాయంగా పలకరిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14అసెంబ్లీ నియోజకవర్గాల్లో 45రోజుల పాటు 577 కిలోమీటర్లు యువ‌గ‌ళం పాద‌యాత్ర అడ్డంకులు అధిగ‌మించి సాఫీగా సాగ‌డానికి స‌హ‌క‌రించిన టీడీపీ కుటుంబం సభ్యులకు, అభిమానులకు, ప్ర‌జ‌లకు లోకేష్ కృతఙ్ఞతలు చెప్పారు.

ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజల మధ్య ఉండేందుకు.. ప్రజల కష్టలను స్తానిక పరిస్థితులను తెలుసుకునేందుకు నారా లోకేష్  పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర 400 రోజులు పాటు, 4వేల కిలో మీటర్లు చేయనున్నారు. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా వరకు నారా లోకేష్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..