తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కొనసాగుతోంది. యువగళం పాదయాత్రలో భాగంగా 19 వ రోజు తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఉదయం 8.30 గంటలకు నారాయణవనం మండలం విత్తన తడుకు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 9.35 గంటలకు స్థానికులతో సమావేశం కానున్నారు. 10.30 గంటలకు అరణ్యకండ్రిగ లో దాసరి పద్మశాలి సామాజిక వర్గంతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం కృష్ణంరాజుల కండ్రిగ, తుంబూర ప్రాంతాల్లో పాదయాత్రను చేయనున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు ఐ ఆర్ కండ్రిగ వద్ద లంచ్ బ్రేక్ అనంతరం తీసుని.. మధ్యాహ్నం 3.05 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. సాయంత్రం స్థానికులతో సమావేశం కానున్నారు. అనంతరం డీఎం.
ఏపీలో ప్రజల మధ్య ప్రజల కష్టలను స్తానిక పరిస్థితులను తెలుసుకునేందుకు లోకేష్ చేపట్టిన పాదయాత్ర 400 రోజులు , 4వేల కిలో మీటర్లు సాగనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా వరకు చేయనున్నారు. అయితే ఇప్పటి వరకూ లోకేష్ పాద యాత్ర 231.3 కిలోమీటర్ల మేర జరిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..